news

News May 14, 2024

తెలంగాణలో 65.66శాతం పోలింగ్?

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 65.66శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే తుది పోలింగ్ శాతంపై రేపు ఈసీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో ఓవరాల్‌గా 81.3శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీన్ని సీఈవో అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

News May 14, 2024

ఈ ఏడాది ISSలోకి భారత వ్యోమగామి: US అంబాసిడర్

image

ఈ ఏడాది అమెరికన్ మిషన్‌లో భాగంగా ఇండియా వ్యోమగామి ఒకరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు చేరుకునే అవకాశం ఉందని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. US అధ్యక్షుడి ప్రతిపాదన మేరకు భారత ప్రభుత్వం ఓ వ్యోమగామి పేరును సూచించిందని చెప్పారు. సముద్రగర్భం నుంచి అంతరిక్షం వరకు ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడమే దీని ఉద్దేశమన్నారు. ఆ వ్యోమగామి వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.

News May 14, 2024

13 స్థానాల్లో గెలుస్తాం: రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో 6-7 స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌‌కు 13 స్థానాలు వస్తాయని ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్ మెరుగైందన్న సీఎం.. తమ అభ్యర్థి దానం నాగేందర్‌కు కనీసం 20వేల మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీకి 220కు పది అటో, ఇటో వస్తాయని రేవంత్ అంచనా వేశారు.

News May 14, 2024

రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. కొన్ని గంటలే గడువు

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు గడువు ఇవాళ రాత్రి 11.59 గంటలతో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది.
సైట్: <>https://www.rrbapply.gov.in/<<>>

News May 14, 2024

DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ

image

డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ.34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాధావాన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు సీబీఐ వెల్లడించింది.

News May 14, 2024

TG: రానున్న 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. MBNR, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

News May 14, 2024

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివర్తి నాని

image

AP: కొందరు వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే దాడిలో నాని గన్‌మెన్ కూడా గాయపడ్డారు. అతడిని ఓ వ్యక్తి సమ్మెటతో దాడి చేయగా.. కణత భాగంలో గాయమైంది.

News May 14, 2024

హోర్డింగ్ కూలిన ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

image

ముంబైలో హోర్డింగ్ <<13244596>>కుప్పకూలిన<<>> ఘటనలో ‘ఇగో మీడియా’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అతడి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు భవేశ్‌కు 20సార్లకు పైగా అధికారులు ఫైన్ విధించారు. కుప్పకూలిన హోర్డింగ్‌కూ అతను అనుమతి తీసుకోలేదట. ఆ ప్రాంతంలో అనుమతి ఉన్న గరిష్ఠ పరిమాణం కన్నా అది 9 రెట్లు పెద్దదని తేలింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

News May 14, 2024

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

image

TG: రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్నటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయన్న ఆయన.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానన్నారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్నబియ్యం పంపిణీపై సమీక్షిస్తానని చెప్పారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా రుణం పొంది రుణమాఫీ చేస్తామని CM వివరించారు.

News May 14, 2024

ఏపీలో 81.3% శాతం పోలింగ్?

image

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 81.3% శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 2019 ఎన్నికల్లో 79.6% కంటే ఈసారి 1.7 శాతం ఎక్కువ పోలింగ్ నమోదవడం గమనార్హం.