India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిహార్ జైలులో ఉన్నప్పుడు తనకు 15రోజులు ఇన్సులిన్ ఇవ్వలేదని ఢిల్లీ CM కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో అన్ని రకాల ఔషధాలు తాను ఉచితం చేశానని గుర్తు చేశారు. తానొక షుగర్ పేషెంట్‌నని, డైలీ 52యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటానని వెల్లడించారు. కాగా.. లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. హరియాణాలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్‌లో ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 65.66శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే తుది పోలింగ్ శాతంపై రేపు ఈసీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో ఓవరాల్‌గా 81.3శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. దీన్ని సీఈవో అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ ఏడాది అమెరికన్ మిషన్‌లో భాగంగా ఇండియా వ్యోమగామి ఒకరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు చేరుకునే అవకాశం ఉందని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. US అధ్యక్షుడి ప్రతిపాదన మేరకు భారత ప్రభుత్వం ఓ వ్యోమగామి పేరును సూచించిందని చెప్పారు. సముద్రగర్భం నుంచి అంతరిక్షం వరకు ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడమే దీని ఉద్దేశమన్నారు. ఆ వ్యోమగామి వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.
TG: లోక్‌సభ ఎన్నికల్లో 6-7 స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌కు 13 స్థానాలు వస్తాయని ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్ మెరుగైందన్న సీఎం.. తమ అభ్యర్థి దానం నాగేందర్‌కు కనీసం 20వేల మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీకి 220కు పది అటో, ఇటో వస్తాయని రేవంత్ అంచనా వేశారు.
RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు గడువు ఇవాళ రాత్రి 11.59 గంటలతో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది.
సైట్: <
డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ.34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాధావాన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు సీబీఐ వెల్లడించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. MBNR, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
AP: కొందరు వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే దాడిలో నాని గన్‌మెన్ కూడా గాయపడ్డారు. అతడిని ఓ వ్యక్తి సమ్మెటతో దాడి చేయగా.. కణత భాగంలో గాయమైంది.
ముంబైలో హోర్డింగ్ <<13244596>>కుప్పకూలిన<<>> ఘటనలో ‘ఇగో మీడియా’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అతడి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు భవేశ్‌కు 20సార్లకు పైగా అధికారులు ఫైన్ విధించారు. కుప్పకూలిన హోర్డింగ్‌కూ అతను అనుమతి తీసుకోలేదట. ఆ ప్రాంతంలో అనుమతి ఉన్న గరిష్ఠ పరిమాణం కన్నా అది 9 రెట్లు పెద్దదని తేలింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Sorry, no posts matched your criteria.