news

News May 14, 2024

పతంజలి కేసు.. IMA ప్రెసిడెంట్‌పై సుప్రీంకోర్టు అసహనం

image

పతంజలి కేసు విచారణలో ఆ సంస్థపై కేసు వేసిన ఐఎంఏకూ సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు తప్పడం లేదు. IMAను కోర్టు గత హియరింగుల్లో విమర్శించగా.. అది దురదృష్టకరమని ఆ సంస్థ చీఫ్ అశోకన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను గత విచారణలో కోర్టు తప్పుపట్టగా ఈరోజు అశోకన్ బేషరతు క్షమాపణ కోరారు. అయితే కోర్టు దానిని స్వీకరించేందుకు నిరాకరించింది. మరోవైపు పతంజలి వివరణ సమర్పించేందుకు 3 వారాల గడువు ఇచ్చింది.

News May 14, 2024

IPL: వీరిలో బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ ఏది?

image

IPL: క్రికెట్ అభిమానులకు ఆసక్తికర పజిల్. ఈ ఏడాది IPLలో ఓపెనర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మెక్‌గుర్క్, సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, గిల్, కేఎల్ రాహుల్, జైస్వాల్, డుప్లెసిస్, రోహిత్ శర్మ రాణించారు. మరి వీరిలో బెస్ట్ ఓపెనింగ్ జోడీని ఎంచుకోండి. కింద కామెంట్ చేయండి.

News May 14, 2024

ఇదేనా సమానత్వం?

image

క్రికెట్‌లో సమానత్వం కోసం పురుషులతో పాటు మహిళలకు జీతాలు పెంచడం బాగున్నా అనేక విషయాల్లో పక్షపాతం కనిపిస్తోంది. ఇటీవల భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌పై 5-0తో T20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ విషయం చాలామందికి తెలియకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఈ సిరీస్‌లోనే అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన ఆశా శోభన.. ఢాకాలో ప్రెస్ కాన్ఫరెన్స్‌ పెడితే కేవలం ఒకే జర్నలిస్టు ఉండటం మహిళా క్రికెటర్ల మనసును కలచివేసింది.

News May 14, 2024

‘కల్కి’ డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకొణె?

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను దీపికా పదుకొణె పూర్తి చేసినట్లు సమాచారం. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పారని, మిగతా వెర్షన్లకు వేరేవారితో చెప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News May 14, 2024

సాయంత్రం నుంచి అందుబాటులోకి CUET UG అడ్మిట్ కార్డులు

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG -2024) అడ్మిట్ కార్డులు నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్నాయి. NTA <>వెబ్‌సైట్<<>> నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు పరీక్షలు జరగనుండగా, 15,16, 17, 18 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా రిలీజ్ చేశారు. మిగతా పేపర్లకు సంబంధించినవి తర్వాత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

News May 14, 2024

కేంద్రంలో దొరల పాలన నడుస్తోంది: జైరామ్

image

మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. వారు నడిపించేది లోక్‌తంత్ర కాదని, ధనతంత్ర(దొరల పాలన) అని ఆరోపించారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. వాటిని కాపాడేందుకే తాము ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. మోదీ అయోమయంలో ఉన్నారని, అందుకే హిందూ-ముస్లిం, మంగళసూత్రం, అంబానీ-అదానీ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

News May 14, 2024

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

image

AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు YCP కార్యకర్తల ఇళ్లను TDP నేతలు కూల్చేశారు. దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల MLA కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ కాన్వాయ్‌పై కొందరు TDP కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

News May 14, 2024

మంత్రి బుగ్గనపై అట్రాసిటీ కేసు

image

AP: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై బేతంచెర్ల పోలీస్‌ స్టేషన్‌లో SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. తనను బుగ్గన కులం పేరుతో దూషించారని డోన్ ఇండిపెండెంట్ అభ్యర్థి పీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తన కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో బుగ్గనతోపాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 14, 2024

మోదీపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు

image

ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో మొదట ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ఆ పిటిషనర్‌కు సూచించింది. దీంతో సదరు వ్యక్తి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.

News May 14, 2024

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి అర్హతలివే..

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60ఏళ్లలోపు ఉండాలని BCCI తెలిపింది. కనీసం 30టెస్టులు/50వన్డేలు ఆడి ఉండాలని, లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్లు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని పేర్కొంది. లేదంటే IPL టీమ్, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టులో ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్లు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలంది. అనుభవం ఆధారంగా వేతనం ఇవ్వనున్నట్లు చెప్పింది.