news

News May 26, 2024

ట్రోల్స్‌కు స్టార్క్ బదులిచ్చాడుగా: KKR

image

స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ తనపై వచ్చిన ట్రోల్స్‌కు బదులిచ్చారని KKR పేర్కొంది. ఇవాళ SRHతో ఫైనల్లో ప్రదర్శనను ఉద్దేశించి స్టార్క్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారని మార్ఫ్‌డ్ ఫొటోను Xలో షేర్ చేసింది. క్వాలిఫయర్-1లో మూడు వికెట్లు తీసిన స్టార్క్, ఇవాళ్టి మ్యాచులోనూ 2 వికెట్లు తీశారు. వేలంలో రూ.24.75 కోట్లు పలికిన ఈ ఆసీస్ బౌలర్, లీగ్ దశలో విఫలమవ్వడంతో నెటిజన్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

News May 26, 2024

మరోసారి హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: హత్యాయత్నం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనలో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్ 5 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం తీర్పిచ్చింది.

News May 26, 2024

IPL: ముచ్చటగా మూడోసారి

image

KKR ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గంభీర్ మెంటార్‌షిప్‌లో కప్పు నెగ్గింది. ఈ మెగా టోర్నీలో MI(5), సీఎస్కే(5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్(3) నిలిచింది.

News May 26, 2024

అమెరికాలో ల్యాండ్ అయిన రోహిత్ అండ్ కో

image

టీ20 వరల్డ్ కప్‌ కోసం అమెరికా బయలుదేరిన భారత ఆటగాళ్లు తాజాగా న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా జడేజా తీసిన సెల్ఫీని రోహిత్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ల్యాండ్ అయిన వారిలో 10మంది ఆటగాళ్లుండగా.. హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ, రిజర్వు ప్లేయర్ రింకూ సింగ్ త్వరలోనే జట్టుతో చేరనున్నారు. వచ్చే నెల 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

News May 26, 2024

BIG BREAKING: ఐపీఎల్ విజేత KKR

image

కోల్‌కతా నైట్‌రైడర్స్ IPL-2024 విజేతగా నిలిచింది. SRHతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. SRH ఇచ్చిన 114 పరుగుల టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ 52*, గుర్బాజ్ 39 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు.

News May 26, 2024

తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు: FSSAI

image

తల్లిపాల విక్రయానికి సంబంధించి వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని FSSAI ఆదేశించింది. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లిపాల విక్రయానికి అనుమతి లేదంది. ఇలాంటి వాటికి లైసెన్సులు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఏమీ ఆశించకుండా ప్రభుత్వం పాల బ్యాంకులను నిర్వహిస్తోందని FSSAI తెలిపింది.

News May 26, 2024

తాడిపత్రి అల్లర్ల ఘటన.. AR అడిషనల్ SPపై వేటు

image

AP: అనంతపురం AR అడిషనల్ SP లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రేంజ్ DIG ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని అప్పటి SP బర్దర్ కోరగా.. లేవంటూ ఆయన సమాధానమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అల్లర్లు పెరిగినట్లు బర్దర్ తన నివేదికలో తెలిపారు. కొత్త SP గౌతమి సాలి విచారణలోనూ లక్ష్మీనారాయణ పొంతన లేని జవాబులు చెప్పడంతో ఆయనపై వేటు పడింది.

News May 26, 2024

తీరం దాటుతున్న రెమాల్ తుఫాన్

image

బంగాళాఖాతంలో పుట్టిన రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటుతోంది. ఈరోజు అర్ధరాత్రికల్లా పూర్తిగా తీరంపైకి చేరుకుంటుందని బంగ్లా, భారత వాతావరణ శాఖలు ప్రకటించాయి. తీరప్రాంతాల వెంబడి గాలులు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే అటు బంగ్లాదేశ్, ఇటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

News May 26, 2024

టీ20 వరల్డ్ కప్ గెలిచాకే కేక్ తింటా: రోహిత్ శర్మ

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు ప్లేయర్స్ టీ20 వరల్డ్‌ కప్ కోసం తాజాగా అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బయలుదేరే ముందు వారు కేక్ కటింగ్ వేడుక చేసుకున్నారు. కేక్ తినిపించేందుకు పంత్ యత్నించగా రోహిత్‌ నిరాకరించారు. గెలిచాకే తింటానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్‌, పంత్‌తో పాటు బుమ్రా, సూర్య, జడేజా, దూబే, సిరాజ్, అర్షదీప్, ఖలీల్, కుల్‌దీప్, అక్షర్‌ ఉన్నారు.

News May 26, 2024

IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్

image

KKRతో జరుగుతున్న ఫైనల్లో 113 రన్స్‌కే పరిమితమైన SRH.. IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. 2013లో ముంబైపై చెన్నై 125/9 రన్స్ చేసింది. 2017లో పుణేతో మ్యాచులో ముంబై 129/8 పరుగులకే పరిమితమైంది. అయితే ఛేజింగ్‌కు దిగిన పుణేను ముంబై 128/6 రన్స్‌కే కట్టడి చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.