India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్‌ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
APలో గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని NDA శాసనసభాపక్ష సమావేశంలో CM చంద్రబాబు అన్నారు. ‘2047 నాటికి APలో పేదరికం లేకుండా చేస్తాం. 3పార్టీలు సమగ్ర కృషితో ఘన విజయం సాధించాం. రాష్ట్రాభివృద్ధికి కలిశాం.. మన కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రజలు మెచ్చేలా మన పాలన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజలకు వివరించాలి. నియోజకవర్గాల్లో నేతలు విజన్‌తో ముందుకెళ్లాలి’ అని సూచించారు.
AP: తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ‘నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అన్నదానం కూడా సరిగ్గా నిర్వహించలేదు. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా పెంచుతాం’ అని స్పష్టం చేశారు.
AP: విజయవాడ వరద బాధితులకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లితే.. ప్రభుత్వం రూ.700 కోట్లే కేటాయించిందని మాజీ MLA మల్లాది విష్ణు విమర్శించారు. ‘ఆస్తి పన్ను, ఒక నెల విద్యుత్ ఛార్జీ రద్దు చేయాలి. దెబ్బతిన్న ఆటోకి రూ.10 వేలు చాలవు.. కొత్త ఆటో ఇవ్వాలి. MSMEలను ఆదుకోవాలి. రూ.2లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని దేవినేని అవినాశ్ కోరారు.
కేరళలో ఎంపాక్స్ కలకలం రేగింది. యూఏఈ నుంచి మలప్పురం వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా ఇది దేశంలోనే రెండో ఎంపాక్స్ కేసు. మొట్టమొదటి కేసు ఢిల్లీలో నమోదైంది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇవే లక్షణాలుండటంతో పరీక్షించగా నెగటివ్‌గా తేలింది.
AP: తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నెల్లూరు, పల్నాడుతో పాటు పలు జిల్లాల నేతలు పాల్గొన్నారు. నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగవద్దని ఆయన కోరారు.
➦1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని సూచించిన ఎన్నికల సంఘం
➦1999లో ఎన్నికల చట్ట సంస్కరణలపై లా కమిషన్ నివేదిక.
➦ 2018లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక విడుదల
➦2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ
➦2023 SEP 2న మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
➦2024 మార్చి 14న నివేదిక సమర్పించిన కమిటీ
➦2024 సెప్టెంబర్ 18న జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
AP: తాము పైకి 3 వేర్వేరు పార్టీలు(టీడీపీ, జనసేన, బీజేపీ)గా కనిపిస్తున్నా తమ గుండెల్లో మోగేది ఒకటే చప్పుడని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో NDA శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘3 భిన్నమైన పార్టీలు. ఆత్మ ఒక్కటే. మూడు పార్టీలు ఏకతాటిపై ముందుకెళ్లాలి. రాష్ట్రం అద్భుతంగా ఉండాలి. బలమైన అభివృద్ధి సాధించాలన్నదే ఏకైక లక్ష్యం’ అని ఆయన వెల్లడించారు.
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తెలుగు హీరో నటిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు-రాజమౌళి సినిమా లేదా సందీప్ వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’లో ఏదో ఒక సినిమాకు ఆమె సైన్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఆమె ఇటీవలే సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.
పాక్‌తో ఉన్న సింధుజలాల ఒప్పందంలో మార్పులు చేయాలని భారత్ యోచిస్తోంది. ఆ మేరకు ఆ దేశానికి తాజాగా నోటిఫై చేసింది. 6 దశాబ్దాల క్రితం ఇరు దేశాలు సింధు జలాల ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాని ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు, రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు చెందుతాయి. అయితే భారత వాటా నదుల్లో కూడా ప్రాజెక్టులు కట్టకూడదని పాక్ అభ్యంతరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మార్పులు చేయాలనుకుంటోంది.
Sorry, no posts matched your criteria.