India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను దీపికా పదుకొణె పూర్తి చేసినట్లు సమాచారం. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పారని, మిగతా వెర్షన్లకు వేరేవారితో చెప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG -2024) అడ్మిట్ కార్డులు నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్నాయి. NTA <
మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. వారు నడిపించేది లోక్తంత్ర కాదని, ధనతంత్ర(దొరల పాలన) అని ఆరోపించారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. వాటిని కాపాడేందుకే తాము ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. మోదీ అయోమయంలో ఉన్నారని, అందుకే హిందూ-ముస్లిం, మంగళసూత్రం, అంబానీ-అదానీ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు YCP కార్యకర్తల ఇళ్లను TDP నేతలు కూల్చేశారు. దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల MLA కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు TDP కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
AP: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. తనను బుగ్గన కులం పేరుతో దూషించారని డోన్ ఇండిపెండెంట్ అభ్యర్థి పీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తన కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో బుగ్గనతోపాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధాని మోదీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో మొదట ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ఆ పిటిషనర్‌కు సూచించింది. దీంతో సదరు వ్యక్తి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60ఏళ్లలోపు ఉండాలని BCCI తెలిపింది. కనీసం 30టెస్టులు/50వన్డేలు ఆడి ఉండాలని, లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్లు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని పేర్కొంది. లేదంటే IPL టీమ్, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టులో ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్లు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలంది. అనుభవం ఆధారంగా వేతనం ఇవ్వనున్నట్లు చెప్పింది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నజ్ముల్ హుస్సేన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: నజ్ముల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తంజిద్ హసన్ తమిమ్, షకీబుల్ హసన్, హృదయ్, మహ్మదుల్లా రియాద్, జాకీర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, మెహదీ హసన్, రిషద్ హసన్, ముస్తాఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హాసన్ షకీబ్.
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 4న అరెస్టయిన JDS MLA హెచ్డీ రేవణ్ణ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వగా, ఇవాళ బయటికొచ్చారు. ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తుకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ అశ్లీల వీడియోల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
టీ, కాఫీలు తాగడం అదుపులో ఉంచుకోవాలని ICMR సూచించింది. ముఖ్యంగా ఆహారం తినే ముందు, ఆ తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. కనీసం గంట గ్యాప్ ఉండాలని పేర్కొంది. ఆహారంలోని ఐరన్ శరీరానికి అందకుండా ఇందులోని టానిన్ అనే పదార్థం అడ్డుకుంటుందని తెలిపింది. అందుకే ఆహారానికి.. కాఫీ, టీలకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ICMR స్పష్టం చేసింది. శరీరానికి ఆక్సిజన్ అందడానికి ఐరన్ దోహదపడుతుంది.
Sorry, no posts matched your criteria.