India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-4కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా చంద్రయాన్-4కి ఇస్రో రూపకల్పన చేసింది. ఇటు గగన్‌యాన్, శుక్రయాన్ విస్తరణ ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,516 కోట్లు కేటాయించింది. పీఎం-ఆశా పథకానికి రూ.35 కోట్లు కేటాయింపు, ఎన్జీఎల్ఏ వాహననౌకకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
స్టాక్ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల కోతపై US ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. భయంతో ఐటీ షేర్లను తెగనమ్మడంతో బెంచ్‌మార్క్ సూచీలు కనిష్ఠ స్థాయులకు చేరాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అండగా నిలవడంతో నష్టాల్ని తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ 82,948 (-131), నిఫ్టీ 25,377 (-41) వద్ద క్లోజయ్యాయి. టాప్-5 లూజర్స్‌లో టెక్ షేర్లే ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26వ తేదీన యూకేలో ప్రీమియర్ షోలు ఉంటాయని తెలిపాయి. కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఓవర్సీస్ బుకింగ్స్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.
AP: నూతన మద్యం విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర క్వార్టర్‌కు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని నిర్ణయించారు.
AP: రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామని మాజీ మంత్రి విడదల రజినీ తెలిపారు. రాత్రికి రాత్రే అన్ని కళాశాలలను కట్టలేమని ఆమె చెప్పారు. ‘వందేళ్లలో కేవలం 11 కాలేజీలే కట్టారు. అలాంటిది ఐదేళ్లలోనే ఐదు కట్టాం. మరో ఐదు కాలేజీలు నిర్మాణదశలో ఉన్నాయి. మిగతా కళాశాలలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి. సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.
TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని సింప్లిఫై చేయడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ దృష్టి సారించింది. బడ్జెట్‌కు ముందే, 2025 జనవరిలోపు ఫాస్ట్‌ట్రాక్ రివ్యూ చేపట్టాలని చీఫ్ కమిషనర్ వీకే గుప్తా కమిటీని కోరినట్టు NDTV తెలిపింది. కాలం చెల్లిన క్లాజులు, సెక్షన్లు, సబ్ సెక్షన్లు 120 వరకు తొలగిస్తారని సమాచారం. టెలికం, సెజ్, క్యాపిటల్ గెయిన్స్ డిడక్షన్లూ ఇందులో ఉంటాయి. అవసరమైతే లా మినిస్ట్రీ సాయం తీసుకుంటారని తెలిసింది.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజాధనం ఆదా అవడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.
Sorry, no posts matched your criteria.