India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ‘ఆయుధ పూజ’ సాంగ్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 11.07గంటలకు సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫొటోను పంచుకున్నారు. ఈనెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
దక్షిణాది నటి CID శకుంతల(84) కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో నిన్న తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.
ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా ఆన్‌లైన్ టికెట్లను TTD రిలీజ్ చేసింది. ఈ నెల 20న ఉ.10 గంటల వరకు నమోదుకు అవకాశమిచ్చింది. 21న మ.3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23న ఉ.10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటలకు వసతి కోటా విడుదల చేయనున్నారు.
పని ఒత్తిడి భరించలేక యువ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకుంది. పుణే (MH)కు చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది మార్చిలో ‘Ernst and Young’ కంపెనీలో జాయిన్ అయింది. ఎక్కువ పని గంటలతో కుంగిపోయిందని, తినేందుకు, నిద్రపోయేందుకూ సరైన సమయం లేక జులై 20న ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లి పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలకు ఆ కంపెనీ నుంచి ఒక్కరూ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం ఉంటేనే గుర్తింపు, గౌరవం ఉంటుందనే భావనలో యువత ఉంది. దీంతో చాలామంది ఎంత స్ట్రెస్ ఉన్నా ఉద్యోగజీవితాన్ని లాక్కొస్తున్నారు. జీవితమంటే కేవలం ఉద్యోగమేనన్నట్టు భావిస్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి పట్టించుకోవట్లేదు. మెంటల్ ప్రెషర్ పెరగడంతో వారికి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. తాజాగా 26ఏళ్ల CA ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించాలి.
లెబనాన్, సిరియాలో జరిగిన పేలుళ్లకు కారణమైన పేజర్లు తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీటి తయారీ సమయంలో ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ స్పై ఏజెన్సీ చిన్న మొత్తం పేలుడు పదార్థాలతో కూడిన డివైస్‌ను అమర్చినట్లు తెలిపాయి. దీనిని స్కానర్లకు కూడా చిక్కకుండా కోడ్ రిసీవ్ చేసుకోగానే పేలేలా ఏర్పాటు చేశాయన్నాయి.
చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లైండ్‌సైట్ పరికరం ద్వారా కళ్లు, కంటి నాడిని కోల్పోయినా చూడగలరు. దృష్టి కణాలు పాడవకపోతే పుట్టుకతో చూపు లేనివారు కూడా చూడొచ్చు. దీని ద్వారా తొలుత తక్కువ రిజల్యూషన్‌లో కనిపించినా భవిష్యత్‌లో సహజ దృష్టి కంటే మెరుగయ్యే అవకాశముందని మస్క్ తెలిపారు.
వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్‌కు రూ.15-20 పెరిగాయి. పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్ఠంగా రూ.170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.