news

News September 17, 2024

గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణనాథులు

image

ఇంట్లో, కాలనీల్లో వెలసిన గణనాథుని విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న విగ్రహాలు మండపాలను విడిచిపెడుతుండటంతో ‘మళ్లీ రావయ్యా’ అంటూ భక్తులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇంట్లో నెలకొల్పిన ఏకదంతుడిని పంపించకుండా ఎమోషనల్ అవుతున్నారు. ఎన్నో రకాల రూపాలతో ఉన్న వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకుంటున్నాయి. బైబై గణేశా!

News September 17, 2024

రేవంత్ కదలికలపై KCR ఫోకస్!

image

TG: కొంతకాలంగా తన ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న మాజీ CM, BRS అధినేత KCR సీఎం రేవంత్ కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. HYD పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులను పదేపదే బదిలీ చేయడం రేవంత్ అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తోందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. అటు కరోనా సమయంలోనూ కొనసాగించిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని ఆయన విమర్శించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

News September 17, 2024

మియా మ్యాజిక్‌కు ఏడాది పూర్తి

image

సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 SEP 17న భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశారు. భారత్ తరఫునా ఇవే ఉత్తమ బౌలింగ్ గణాంకాలు. ఆసియా కప్‌-2023లో శ్రీలంకపై కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. సిరాజ్ దెబ్బకు 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు లంక ఆలౌట్ అయ్యింది. భారత్ 6.1 ఓవర్లలోనే టార్గెట్‌ను చేరుకుంది. దీంతో 8వ ఆసియా కప్ టైటిల్‌ను టీమ్ ఇండియా తన ఖాతాలో వేసుకుంది.

News September 17, 2024

నందిగం సురేశ్‌కు ముగిసిన పోలీస్ కస్టడీ

image

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు పోలీసు కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో మంగళగిరి రూరల్ పీఎస్‌లో ఆయనను పోలీసులు రెండు రోజులు విచారించారు. విచారణ అనంతరం మంగళగిరి పీఎస్ నుంచి ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.

News September 17, 2024

PHOTO OF THE DAY

image

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. కాసేపటి క్రితమే శోభాయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఊరేగింపు సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగింది. ఈక్రమంలో సచివాలయం ముందు మహాగణపతిని కెమెరాలో బంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఇది ఫొటో ఆఫ్ ది డే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోలకు ఇమేజ్ పక్కన క్లిక్ చేయండి.

News September 17, 2024

‘OG’ కోసం సిద్ధమవుతోన్న నటి శ్రియారెడ్డి

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ షూటింగ్‌ను త్వరలోనే పూర్తిచేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తన పాత్ర కోసం నటి శ్రియారెడ్డి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడ అయిన కళరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తికాగా పవన్‌తో మరో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్.

News September 17, 2024

ఢిల్లీ CMగా ఆతిశీ ఎంపికకు కలిసొచ్చిందేంటి?

image

ఢిల్లీ కొత్త CMగా ఆతిశీ ఎంపికకు కొన్ని కారణాలు ఉన్నాయి. 2013 నుంచే ఆప్‌లో విధాన నిర్ణయాల్లో ఆమెది కీలక పాత్ర. 2015-18 వరకు DyCM సిసోడియాకు సలహాదారు. 2020లో కల్‌కాజీ నుంచి MLAగా గెలిచి PWD, విద్య, కల్చర్, టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేజ్రీ, సౌరభ్, సిసోడియా, జైన్ జైలుకెళ్లినప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారు. వ్యవస్థలపై పట్టు, కేజ్రీ గీసిన గీత దాటకపోవడం ఆమెకు కలిసొచ్చిన అంశాలు.

News September 17, 2024

క్రేన్ వద్దకు చేరుకున్న మహాగణపతి

image

ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్‌‌పై ఏర్పాటు చేసిన క్రేన్-4 వద్దకు చేరుకున్నాడు. అశేష జనవాహిని తోడు రాగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో వినాయకుడి విగ్రహాన్ని భారీ క్రేన్‌తో హుస్సేన్‌సాగర్ నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.

News September 17, 2024

రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగులో డమ్మీ బాంబ్!

image

TG: CM రేవంత్ నివాసం వద్ద కలకలం రేపిన <<14108323>>బ్యాగ్<<>> మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసిన ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు. అయితే ఆ బైక్‌ను తీసుకెళ్లిన అతడి ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబ్ ఉందనుకొని తెలియకుండా రేవంత్ నివాసం సమీపంలో పడేశాడు. ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు.

News September 17, 2024

పేద విద్యార్థుల ‘డాక్టర్’ కలను చంద్రబాబు చెరిపేశారు: వైసీపీ

image

AP: NEET స్కోర్‌ 600 దాటిన విద్యార్థులకూ కన్వీనర్‌ కోటా తొలి కౌన్సెలింగ్‌లో మెడికల్ సీటు దక్కలేదని YCP ట్వీట్ చేసింది. ‘పేద విద్యార్థుల ‘డాక్టర్’ కలను చంద్రబాబు చెరిపేశారు. జగన్ ప్రభుత్వంలో 5 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా రావడంతో గతేడాది 563 స్కోర్‌కే MBBS సీటు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకంతో కొత్త కాలేజీలు ఆగిపోయి, మంచి ర్యాంకు సాధించినా సీటు రావట్లేదు’ అని పేర్కొంది.