India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను తగ్గించనుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ 18న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఈ విషయంపై ప్రకటన చేయనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వీడడం, ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కొన్ని నెలల ముందు ఫెడ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TG: రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని CM రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్‌హౌస్‌లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
TG: ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి ఇంకా కేసీఆర్ తేరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెగ్యులర్‌గా ఫామ్ హౌస్‌లో KCRకు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. దొరల గడీలు బద్దలై ప్రజా పాలన వచ్చిందనే విషయం ఆయనకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణను కబళించే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.
TG: రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో KTRపై CM రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘ఇప్పుడు ట్విటర్ పిట్ట ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్‌ను పుట్టించి, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి’ అని ఫైర్ అయ్యారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపేయడం రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోసింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చూస్తోందని విపక్షాలంటున్నాయి. ప్లాంట్‌ను కాపాడలేకుంటే కేంద్రం నుంచి కూటమి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ TDPని విపక్షాలు ఇలాగే కార్నర్ చేశాయి. ఏదేమైనా స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయమైనా APలో రాజకీయంగా పెను దుమారమే రేపనుంది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. సినిమాలో మూడో పాత్ర చుట్టే కథ తిరుగుతుందని సమాచారం. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా మూవీ విడుదల కానుంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌత్ కొరియాతో జరిగిన సెమీస్‌లో 4-1 ఆధిక్యంతో భారత్ జయభేరి మోగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ సాధించి టీమ్ ఇండియా విజయానికి బాటలు పరిచారు. జర్మన్ ప్రీత్, ఉత్తమ్ చెరో గోల్ సాధించారు. మరోవైపు ఇప్పటికే పాక్‌తో జరిగిన సెమీస్‌లో గెలిచి చైనా ఫైనల్‌కు చేరుకుంది. రేపు జరగబోయే ఫినాలేలో భారత్, చైనా తలపడనున్నాయి.
TG: సెక్రటేరియట్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కొందరు సన్నాసులు పదేపదే వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఎలాంటి పదవి చేపట్టలేదని వీళ్లకు తెలియదా? తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని మంత్రి పదవులు పొందినవాళ్లు గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.
లండన్‌లో ఉన్నత చదువు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని యూకే పెంచింది. లండన్‌లో చదవాలనుకునే వారు నెలకు రూ.1.63 లక్షలు (1,483 పౌండ్లు), లండన్ బయట చదవాలనుకునేవారు రూ.1.25 లక్షలు (1,136 పౌండ్లు) తమ అకౌంట్‌లో చూపించాలని స్పష్టం చేసింది. 9 నెలల కంటే ఎక్కువ కాలం చదివేవారు దాదాపు రూ.14.77 లక్షలు అకౌంట్లో ఉన్నట్లు వీసా చెకింగ్ సమయంలో చూపాలని పేర్కొంది.
TG: సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామన్న KTRపై మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు. ‘KTR మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. ఆయన వెంటనే డాక్టర్లతో చెక్ చేయించుకోవాలి. యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని భావించి, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహా నేత రాజీవ్ గాంధీ. ఆయన విగ్రహం కూల్చేస్తామనం సిగ్గుచేటు’ అని రాజీవ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.