news

News March 20, 2024

ఆర్సీబీ జెర్సీపై విమర్శలు

image

ఆర్సీబీ జట్టు నిన్న తమ జెర్సీని రివీల్ చేసింది. నీలం, ఎరుపు రంగుల్లో ఉన్న ఆ జెర్సీ డిజైన్ పట్ల నెట్టింట చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ కూడా నీలం, ఎరుపు కాంబోలోనే జెర్సీలు తీసుకొచ్చాయని గుర్తుచేస్తున్నారు. గత ఏడాది జెర్సీ అద్భుతంగా ఉందని, దాన్నెందుకు మార్చారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో తెలపండి.

News March 20, 2024

మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్‌ల్యాండ్

image

అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌ల్యాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా టాప్‌లో నిలిచింది. డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్-5లో నిలిచాయి. ఇక తాలిబాన్ల రాజ్యం నడుస్తున్న అఫ్గానిస్థాన్ చిట్టచివరన 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 10, యూకే 20, అమెరికా 23, జర్మనీ 24, చైనా 64, రష్యా 70వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియా 126వ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్ 108వ ప్లేస్ దక్కించుకుంది.

News March 20, 2024

వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

image

AP: పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి EC పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, AAI, PIB, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

News March 20, 2024

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నేపథ్యమిదే

image

తెలంగాణ గవర్నర్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు BJP MPగా ఎన్నికయ్యారు. రాష్ట్ర BJP చీఫ్‌గానూ పనిచేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్‌గా(2016-2019) సేవలందించారు. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేయనున్నారు.

News March 20, 2024

నేడే ఎన్నికల తొలి నోటిఫికేషన్

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉపసంహరణకు తుది గడువు. వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. అత్యధికంగా తమిళనాడులో ఒకే విడతలో 39 స్థానాలకూ పోలింగ్ నిర్వహించనున్నారు.

News March 20, 2024

ఎల్లుండితో ముగియనున్న హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్

image

అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. ఈ మేరకు USCIS తాజాగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆరోజు రాత్రి 9.30 గంటలకు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం నిలిపేస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈలోపుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇక హెచ్-1బీ క్యాప్ పిటిషన్లపైనా వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

News March 20, 2024

న్యూయార్క్‌లో టీ20 WC ట్రోఫీ ఆవిష్కరణ

image

టీ20 వరల్డ్‌కప్ 2024 ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. న్యూయార్క్‌లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, USA బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 WC జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 6న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

News March 20, 2024

వచ్చే నెల 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు?

image

TG: యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్‌లో 60-70లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి ₹2,203, సాధారణ రకానికి ₹2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.

News March 20, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. వాలంటీర్లపై కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించరాదన్నారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

News March 20, 2024

ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్?

image

TG:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న 13 స్థానాల్లో ఆరింటిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. పెద్దపల్లి-గడ్డం వంశీ, చేవెళ్ల-రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి-సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్-మల్లు రవి, ఆదిలాబాద్-ఆత్రం సుగుణ, సికింద్రాబాద్- దానం పేర్లు ఫిక్సయినట్లు సమాచారం. అటు భువనగిరి, KMM, WGL, HYD, MDK, NZB, KMR స్థానాలు ఖరారు చేయాల్సి ఉంది.