India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసేందుకు ఢిల్లీ CM కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. మంగళవారం భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఎల్జీకి తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ సమర్పించే అవకాశముంది. ఇవాళ సాయంత్రం ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమై తదుపరి CM ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ స్కాంలో తనను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
TG: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. కాగా మరికాసేపట్లో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు.
TG: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అక్టోబర్ నుంచి స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలపై త్వరలోనే వివరాలు వెల్లడించనుంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ మహేశ్, SS రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాపై ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మూవీ స్టోరీ 1800వ శతాబ్దంలో నడుస్తుంది. ఆ సమయానికి చెందిన ఓ గిరిజన తెగ తీరుతెన్నుల్ని జక్కన్న అండ్ కో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో 200కి పైగా కీలక పాత్రలుంటాయని, వాటిలో ఒక్కోపాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని సమాచారం.
AP: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన షాక్ ఇచ్చింది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలిపారు.
సురక్షితంగా, తక్కువ ధరతో గమ్యస్థానాన్ని చేరేందుకు ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, ఏ ట్రైన్ ద్వారా గతేడాది రైల్వేశాఖకు అధిక లాభాలొచ్చాయో తెలుసా? హజ్రత్ నిజాముద్దీన్ – KSR బెంగళూరు మధ్య నడిచే బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ (22692) 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. 5,09,510 మంది ఈ రైలులో ప్రయాణించగా రూ.1,76,06,66,339 వచ్చాయి.
TG: లైంగిక వేధింపుల <<14112127>>కేసులో<<>> కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదు చేసిన FIRలో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘2017లో ఢీ షోలో జానీ మాస్టర్‌తో పరిచయమైంది. 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నియమించుకున్నారు. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. మతం మార్చుకొని అతడిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు’ అని తెలిపారు.
షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ప్రకటన చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థకు ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చినవారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఒకవైపు రిజర్వేషన్లు పెంచాలని చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీంతో ఆయన నిజం రూపం ఏంటో బయటపడిందన్నారు. అయితే సంజయ్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలు గడించాయి. US ఫెడ్ రేట్ల కోత అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన సానుకూల సంకేతాలతో దక్కిన ఆరంభ లాభాలు చివరిదాకా నిలవలేదు. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 82,988 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,383 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ 83,185 వద్ద, నిఫ్టీ 25,445 వద్ద బలమైన రెసిస్టెన్స్‌ను ఎదుర్కొని రివర్సల్ తీసుకున్నాయి.
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దునిత్ వెల్లలాగే నిలిచారు. ఆగస్టులో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. మరోవైపు శ్రీలంకకే చెందిన మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచారు. కాగా గత నెలలో వెల్లలాగే టీ20ల్లో దుమ్ములేపారు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 106 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.
Sorry, no posts matched your criteria.