news

News September 16, 2024

1,376 రైల్వే ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు

image

రైల్వేలో 1,376 పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి <>దరఖాస్తు<<>> ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు RRB అవకాశమిచ్చింది. మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా అప్లై చేసుకునేందుకు కనిష్ఠ వయసు 18, గరిష్ఠ వయసు 43గా ఉంది. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరగనుంది. ఉద్యోగాలను బట్టి జీతం రూ.19,900-44,900 వరకు ఉంటుంది.

News September 16, 2024

రేపు సాయంత్రం ముఖ్య‌మంత్రి రాజీనామా

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మంగ‌ళ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌ల‌వ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 17న‌ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే కేజ్రీవాల్‌ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. తాజాగా కేజ్రీ రాజీనామా లేఖను అందజేసేందుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరడంతో ఆయన అనుమతిచ్చారు.

News September 16, 2024

తొలి వందే మెట్రోను ప్రారంభించిన మోదీ

image

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తొలి వందే మెట్రోను ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య ఈ రైలును ‘నమో భారత్ రాపిడ్ రైలు’గా వర్ణించారు. దీంతో పాటు వర్చువల్‌గా పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్‌కు 2 ట్రైన్లు ఉన్నాయి. మరో మూడు కొల్లాపూర్-పుణే, హుబ్బళ్లి-పుణే, ఆగ్రా-బనారస్ మధ్య నడవనున్నాయి.

News September 16, 2024

ఇదే సరైన సమయం.. బయటకు రండి: విశాల్

image

సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కోరారు. బయటకొచ్చి మాట్లాడితే అవకాశాలు రావనే ఆలోచనలో ఉండొద్దన్నారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై బాలీవుడ్‌ నుంచి స్పందన లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అది అక్కడ పని చేసే మహిళలపై ఆధారపడి ఉంటుంది. బాధితులు నిజాన్ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం’ అని అన్నారు.

News September 16, 2024

రేపే నామినేటెడ్ పదవుల భర్తీ?

image

AP: రాష్ట్రంలో రేపు, లేదా ఎల్లుండి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం. తొలి విడతగా 18 కార్పొరేషన్ ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగతా పోస్టులను దసరాలోగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్. ఈ పోస్టుల్లో జనసేన, బీజేపీ నాయకులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి.

News September 16, 2024

లెఫ్టినెంట్ గవర్నర్‌ అపాయింట్మెంట్ కోరిన కేజ్రీవాల్

image

లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసేందుకు ఢిల్లీ CM కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. మంగళవారం భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఎల్జీకి తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ సమర్పించే అవకాశముంది. ఇవాళ సాయంత్రం ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమై తదుపరి CM ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ స్కాంలో తనను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

బీఆర్ఎస్ కీలక నిర్ణయం

image

TG: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. కాగా మరికాసేపట్లో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు.

News September 16, 2024

వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

TG: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అక్టోబర్‌ నుంచి స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలపై త్వరలోనే వివరాలు వెల్లడించనుంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

News September 16, 2024

మహేశ్-రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

image

సూపర్ స్టార్ మహేశ్, SS రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాపై ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మూవీ స్టోరీ 1800వ శతాబ్దంలో నడుస్తుంది. ఆ సమయానికి చెందిన ఓ గిరిజన తెగ తీరుతెన్నుల్ని జక్కన్న అండ్ కో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో 200కి పైగా కీలక పాత్రలుంటాయని, వాటిలో ఒక్కోపాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని సమాచారం.

News September 16, 2024

జానీ మాస్టర్‌కు జనసేన షాక్

image

AP: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన షాక్ ఇచ్చింది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలిపారు.