news

News September 16, 2024

దూసుకుపోతున్న కమలా హారిస్.. తాజా సర్వేలో 58% మంది మద్దతు

image

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో క‌మ‌లా హారిస్‌ రోజురోజుకూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో గ‌త‌వారం జ‌రిగిన డిబేట్‌లో 58% మంది అమెరిక‌న్లు క‌మ‌లా గెలిచిన‌ట్టు భావిస్తున్నార‌ని ABC/Ipsos పోల్ తేల్చింది. 36% మాత్ర‌మే ట్రంప్ గెలిచిన‌ట్టు భావిస్తున్నారు. జూన్‌లో అధ్య‌క్షుడు బైడెన్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో ట్రంప్ 66% మంది మ‌ద్ద‌తు చూర‌గొన్నారు. క‌మ‌ల అభ్య‌ర్థిత్వంతో ప‌రిస్థితులు మారుతున్నాయి.

News September 16, 2024

శివుడి ఆజ్ఞతో ఓ పక్కకు ఒరిగిన నందీశ్వరుడు!

image

తమిళనాడులోని తిరుపుంగూరులో గల శివాలయంలో నంది ఓ వైపు ఒరిగి ఉంటుంది. శివుడు ఆదేశించడంతోనే ఆ నందీశ్వరుడు ఓవైపు జరిగాడని పురాణాలు చెబుతున్నాయి. అంటరానివాడనే నెపంతో ఓ భక్తుడిని ధ్వజస్తంభం దాటి లోపలికి రావొద్దని పురోహితులు ఆపేస్తారు. దీంతో అతను కన్నీటితో స్వామివారిని వేడుకున్నారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు, భక్తుడికి అడ్డుగా ఉన్నావని పక్కకు వెళ్లిపోమనడంతో నంది పక్కకి జరిగిందని చెప్తుంటారు.

News September 16, 2024

మైఖేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత

image

మైఖేల్ జాక్సన్ సోదరుడు, ‘ది జాక్సన్ 5’ పాప్ బ్యాండ్ సభ్యుడు టిటో జాక్సన్(70) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పలు మ్యూజికల్ ఈవెంట్స్‌తో పాపులరైన ఆయన జాక్సన్ కుటుంబానికి చెందిన 10 మంది సంతానంలో మూడోవాడు. కెరీర్‌లో 3సార్లు గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన ఆయన రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

News September 16, 2024

చర్చలకు ఇదే చివరి అవకాశం.. వైద్య బ‌ృందాలకు బెంగాల్ ప్రభుత్వం అల్టిమేటం

image

జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌ల‌కు బెంగాల్ ప్ర‌భుత్వం ఐదోసారి ఆహ్వానం పంపింది. ఇదే చివ‌రిసార‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇదివ‌ర‌కే ఒకసారి భేటీ అయినా వైద్యుల బృందం చేసిన డిమాండ్ల‌తో చ‌ర్చ‌లు ముందుకు సాగ‌లేదు. తాజాగా CM మ‌మ‌త‌తో చ‌ర్చ‌ల‌కు సా.5 గంట‌లకు కాళీఘాట్‌లోని ఆమె నివాసానికి రావాల్సిందిగా ప్రభుత్వం కోరింది. మీటింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండదని, మినిట్స్ విడుదల చేస్తామని తేల్చిచెప్పింది.

News September 16, 2024

బాగా అలసిపోతున్నారా.. రీజన్స్ ఇవే

image

* శక్తికి మించి శ్రమించడం * భావోద్వేగ, మానసిక ఒత్తిడి * నిద్రలేమి * బోర్ కొట్టడం * వైరల్ ఇన్ఫెక్షన్లు * యాంటీ డిప్రెసంట్స్ వంటి మందులు * విటమిన్లు, మినరల్స్, పోషకాలు లేని ఆహారం * కీమోథెరపీ వంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ * డిప్రెషన్ * యాంగ్జైటీ * గుండె, థైరాయిడ్, డయాబెటిస్, ఆర్థరైటిస్, పార్కిన్‌సన్స్, అనీమియా వంటి క్రానిక్ డిసీజెస్ * చికిత్స తీసుకోకుండా భరిస్తున్న నొప్పులు * మితిమీరిన కెఫిన్, ఆల్కహాల్

News September 16, 2024

అవసరమైతే MLAగా పోటీ చేస్తా: మిథున్ రెడ్డి

image

AP: వక్ఫ్‌బోర్డు బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని YCP ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పుంగనూరు మున్సిపల్ ఆఫీసులో YCP నేతలతో ఆయన సమావేశమయ్యారు. మైనారిటీలకు అండగా ఉంటామన్నారు. పుంగనూరు నియోజకవర్గ పునర్విభజనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. అవసరమైతే తానే వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నుంచి MLAగా పోటీ చేస్తానని తెలిపారు. పుంగనూరుని అభివృద్ధి చేస్తే టీడీపీ నేతలను తానే సన్మానిస్తానని చెప్పారు.

News September 16, 2024

‘ధూమ్-4’లో విలన్‌గా సూర్య!

image

సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ధూమ్-4’లో తమిళ నటుడు సూర్య నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, స్ట్రాంగ్ విలన్ రోల్‌లో ఆయన కనిపిస్తారని టాక్. సూర్య ఇంతకు ముందు బాలీవుడ్‌ సినిమాలో నటించకపోవడం గమనార్హం. యశ్ రాజ్ బ్యానర్‌పై భారీస్థాయిలో ‘ధూమ్-4’ను రూపొందించనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News September 16, 2024

36కి ఆలౌట్ అయినప్పుడు రవిశాస్త్రి ఏం చేశారంటే..: అశ్విన్

image

2020 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆరోజు రాత్రి తమ కోచ్ రవి శాస్త్రి పాటల కార్యక్రమం పెట్టారని స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. ‘అందరం చాలా దిగాలుగా ఉన్నాం. దాంతో రవి మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు. సాంగ్ ట్రాక్స్ పెట్టి పాటలు పాడి మాతో పాడించారు. అందర్నీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాతి టెస్టులో ఘన విజయం సాధించగలిగాం’ అని గుర్తుచేసుకున్నారు.

News September 16, 2024

పిల్లలకోసం స్మార్ట్ వాచ్ తీసుకురానున్న యాపిల్

image

స్కూల్ పిల్లలు ధరించేందుకు తక్కువ ధరలో వాచ్‌లను తీసుకురావాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. చాలా స్కూళ్లలో పిల్లలు ఫోన్‌ తీసుకురావడం నిషేధమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌ల ద్వారా పిల్లలు పాఠశాలల నిబంధనలకు లోబడే కనెక్టివిటీతో ఉంటారని సంస్థ భావిస్తున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఈ వాచ్‌ను లాంచ్ చేసే అవకాశముందని పేర్కొన్నాయి.

News September 16, 2024

యుద్ధాన్ని కొనసాగించేందుకు మాకు వనరులున్నాయి: హమాస్

image

ఇజ్రాయెల్‌తో యుద్ధం విషయంలో తమకు భయం లేదని హమాస్ తాజాగా స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగించేందుకు అవసరమైన వనరులన్నీ తమకున్నాయని ధీమా వ్యక్తం చేసింది. ‘ఎన్నో త్యాగాలు జరిగాయి. ఎంతోమంది అమరులయ్యారు. కానీ వాటికి ఫలితంగా విలువైన యుద్ధ అనుభవాన్ని సంపాదించుకున్నాం. వాస్తవంగా ఇంతటి భారీ యుద్ధంలో వాటిల్లే స్థాయి మరణాలు మావైపు సంభవించలేదు’ అని సమర్థించుకొంది.