news

News September 16, 2024

పరువు కోసం చనిపోవడానికి సిద్ధం: నటి హేమ

image

డ్రగ్స్ రిపోర్టులో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ‘ఇంకా ఛార్జ్‌షీటు నేనే చూడలేదు. మీడియాకు ఎలా వచ్చింది? ఈ వార్తలు చూసి నా తల్లి అనారోగ్యానికి గురైంది. నేనే మీడియా పెద్దల వద్దకు వస్తా. వారే టెస్టులు చేయించండి. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధం. నెగటివ్ వస్తే నాకు న్యాయం చేయాలి. పరువు కోసం చనిపోవడానికి సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు.

News September 16, 2024

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

image

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

News September 16, 2024

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనే!

image

‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు తెలిపాయి. అయితే, త్రివిక్రమ్ కాకుండా మరో డైరెక్టర్‌తో సినిమా రాబోతోందనేది పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మొద్దని చెప్పాయి. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News September 16, 2024

వర్సిటీలను ప్రక్షాళన చేయనున్నాం: లోకేశ్

image

AP: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్ని సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న ఆచార్యులు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 16, 2024

బైడెన్‌‌, కమలను చంపేందుకు ఎవరూ ట్రై చేయట్లేదు: మస్క్

image

US అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం పట్ల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ‘బైడెన్, కమలను చంపాలని ఎవరూ కనీసం ప్రయత్నించడం లేదు’ అని సమాధానమిచ్చారు. ట్రంప్‌కు మస్క్ చాలాకాలంగా బహిరంగంగానే మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. అటు ట్రంప్‌ 2సార్లు ప్రమాదాన్ని తప్పించుకోవడంతో అమెరికావ్యాప్తంగా ఆయనకు సానుభూతి పెరుగుతోంది.

News September 16, 2024

భయపడే మహిళతో శృంగారం అత్యాచారమే: హైకోర్టు

image

లైంగిక సంబంధానికి మహిళ అంగీకారం ఉన్నప్పటికీ అది భయంతో లేక తెలియనితనంతో కూడినదైతే ఆ సంబంధం అత్యాచారం కిందకే వస్తుందని అలహాబాద్ కోర్టు తేల్చిచెప్పింది. తన ఇష్టం లేకుండా భర్త అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పెట్టిన కేసును సదరు భర్త న్యాయస్థానంలో సవాలు చేశారు. అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. స్త్రీ భయంతో ఒప్పుకొంటే అది ఆమె శ‌ృంగారానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.

News September 16, 2024

పెళ్లిపై హీరోయిన్ అదితి పోస్ట్

image

హీరో సిద్ధార్థ్‌తో <<14114235>>పెళ్లి <<>>అనంతరం సోషల్ మీడియాలో హీరోయిన్ అదితిరావు హైదరీ తొలి పోస్ట్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా మహాసముద్రం మూవీ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.

News September 16, 2024

ఢిల్లీ సీఎం రేసులో ‘ఆ ఐదుగురు’

image

ఢిల్లీ CM రేసులో ఐదుగురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. PWD, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిశీ మార్లేనా అందరికన్నా ముందున్నారు. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు ప్రభుత్వాన్ని ఆమే నడిపించారు. 3సార్లు MLA, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు అవకాశం దక్కొచ్చు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ వైఖరిని ప్రజలు, మీడియాలో బలంగా చాటే రాఘవ్ చద్దా పేరును కొట్టిపారేయలేరు. సీనియర్లు కైలాష్ గహ్లోత్, సంజయ్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

News September 16, 2024

ఇండియాలో ఎక్కువ మందికి ఉన్న చివరి పేరు ఇదే!

image

ఒకరిని పోలిన వ్యక్తులు భూమిపై ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఒకే పేరును కలిగిన వాళ్లు వేలల్లో ఉంటారు. అయితే, ఇండియాలో ఎక్కువ మంది తమ చివరి పేరును కుమార్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అర్జెంటీనాలో గొంజాలెజ్, ఆస్ట్రేలియాలో స్మిత్, బంగ్లాదేశ్‌లో అక్తర్, బ్రెజిల్‌లో డా సిల్వా, కెనడాలో స్మిత్, చైనాలో వాంగ్, ఈజిప్టులో మొహమ్మద్, ఫ్రాన్స్‌లో మార్టిన్ అనే పేర్లు కామన్‌గా పెట్టుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది.

News September 16, 2024

నేడు కొరియాతో టీమ్ ఇండియా సెమీస్ పోరు

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఈరోజు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొరియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఐదింటికి ఐదు మ్యాచులనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అటు పాక్ కూడా సెమీస్ చేరి ఈరోజు చైనాతో తలపడుతోంది. ఈ నెల 17న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.