India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా గ్లింప్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. తన రోల్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. ‘నేను దీని గురించి ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రాబోతోంది’ అని రిప్లై ఇచ్చారు.
TG: ఎమ్మెల్సీ కవితపై ఈడీ PMLA(ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ PMLA కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రూ.5లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. PMLA చట్టాన్ని NDA ప్రభుత్వం 2002లో రూపొందించింది.
TG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా, కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని తెలిపింది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని పేర్కొంది. కాపీయింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ముంబై వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయనకు సమన్లు పంపించడం ఇది తొమ్మిదోసారి. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ కోర్టుకు వెళ్లగా.. ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది. అక్కడా ఆయన నిన్న బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి సమన్లు ఇచ్చింది.
AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్‌పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.
TG: ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా ఇటీవల దానం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ మరో కొత్త కేసు ఫైల్ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కొత్త కేసుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న మద్యం పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
దివంగత పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మరో బిడ్డకు జన్మనిచ్చారు. 58ఏళ్ల వయసులో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తండ్రి బల్కార్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాగా, సిద్ధూ 2022 మేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏకైక కుమారుడు మరణించడంతో ఆయన తల్లిదండ్రులు చరణ్ కౌర్(58), బాల్‌కౌర్ సింగ్(60) IVF పద్ధతిలో మరో బిడ్డకు జన్మనిచ్చారు.
TG: ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం HRAలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల GHMC పరిధిలో పనిచేసే ఉద్యోగులకు అధిక నష్టం కలగనుంది. ఇక్కడ ఇప్పటివరకు 30% ఉన్న HRAను 24శాతానికి పరిమితం చేసింది. అలాగే KNR, ఖమ్మం, MBMR, NZB, గోదావరిఖని, WGLలో పనిచేసే వారికి 17%, మిగతా జిల్లాల్లోని వారికి 13-11 శాతానికి తగ్గించింది.
Sorry, no posts matched your criteria.