news

News January 8, 2025

సుప్రీంకు వెళ్లినా కేటీఆర్ తప్పించుకోలేడు: మహేశ్ కుమార్

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

News January 8, 2025

విడాకుల రూమర్లు.. చాహల్ పోస్ట్ వైరల్

image

భార్య ధనశ్రీతో క్రికెటర్ చాహల్ విడాకుల రూమర్లకు ఇంకా తెరపడటం లేదు. దీనిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. అయితే తాజాగా చాహల్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అన్ని శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినేవారికి అది ఎంతో అందమైన మెలోడిలా అనిపిస్తుంది’ అన్న సోక్రటీస్ మాటలను కోట్ చేశారు. దీంతో చాహల్ పోస్ట్‌కు అర్థమేమై ఉంటుందని అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News January 8, 2025

‘పుష్ప-2’కు మ్యూజిక్.. తమన్ క్లారిటీ

image

‘పుష్ప-2’కు మ్యూజిక్ ఇచ్చానని గతంలో చేసిన వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో BGM ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నంబర్ తీసుకున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో సామ్ సి అందించిన BGMను తీసుకున్నారు.

News January 8, 2025

ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్

image

AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

News January 8, 2025

షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్.. పాస్‌పోర్ట్ రద్దు

image

మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.

News January 8, 2025

అదృష్టం అంటే ఈ బాలుడిదే..!

image

చెత్తకుప్పలో దొరికిన చిన్నారి భవితవ్యం మారిపోయింది. లక్నోకు చెందిన రాకేశ్‌ను మూడేళ్ల క్రితం ఎవరో చెత్తకుప్పలో పడేశారు. స్థానికులు గుర్తించి శిశు సంర‌క్ష‌ణ కేంద్రంలో చేర్చారు. తరచూ లక్నోకు వచ్చివెళ్తున్న అమెరికన్ దంపతులు బాలుడి విషయం తెలుసుకొని ద‌త్త‌త తీసుకున్నారు. పాస్‌పోర్టు ప్రక్రియ పూర్తవగానే బాలుడిని వారు US తీసుకెళ్ల‌నున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి USలో పెద్ద సంస్థ‌కు CEO అని తెలుస్తోంది.

News January 8, 2025

కన్యాకుమారి టు ఖరగ్‌పూర్.. ఇస్రో కొత్త ఛైర్మన్ నేపథ్యమిదే..

image

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్<<>> వి.నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. పాఠశాల విద్యాభ్యాసమంతా తమిళ్‌ మీడియంలోనే చదివారు. అనంతరం IIT ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ ఇన్ క్రయోజెనిక్ ఇజినీరింగ్‌ చేశారు. ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. తర్వాత IIT ఖరగ్‌పూర్‌లోనే ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD పూర్తి చేశారు. ఈక్రమంలోనే రాకెట్ అండ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌ విభాగంలో నారాయణన్ ఆరితేరారు.

News January 8, 2025

జనవరి 08: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో మరణం.
* 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం(ఫొటోలో)
* 1962: లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు ఉంచారు.
* 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు
* 1983: సినీ హీరో తరుణ్ బర్త్‌డే
* 1987: భారత మాజీ క్రికెటర్ నానా జోషి మరణం

News January 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 8, 2025

40 ఏళ్ల అనుభవం.. చివరికి ఇస్రో ఛైర్మన్‌గా..

image

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్‌గా<<>> నియమితులైన వి.నారాయణన్ ప్రస్తుతం సంస్థలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(LPSC) డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. నారాయణన్ సారథ్యంలోనే GSLV Mk-3 ద్వారా C25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-2, 3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది.