news

News October 29, 2024

మద్యం షాపులకు చంద్రబాబు వార్నింగ్

image

AP: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలన్నారు.

News October 28, 2024

ప్యాసింజర్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు

image

హరియాణాలో రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు కలకలం రేపింది. పేలుడుకు మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు రైలులో పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను తీసుకువెళ్లడంతో ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News October 28, 2024

జగన్‌పై షర్మిల భర్త హాట్ కామెంట్స్

image

AP: జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేయాలని షర్మిలను భారతీనే అడిగారని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్‌తో సజ్జల చెప్పారు. జగన్‌కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. మధ్యలో చాలామంది చిచ్చులు పెట్టారు. TGలో పార్టీ పెట్టాలని షర్మిలను PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.

News October 28, 2024

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

జేఈఈ మెయిన్స్ 2025-26కు షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. రెండు సెషన్స్‌గా పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ దరఖాస్తులకు నవంబర్ 22 వరకు గడువు ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12లోపు ఫలితాలు రానున్నాయి. రెండో సెషన్ దరఖాస్తులు ఫిబ్రవరిలో స్వీకరించనుండగా, ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి.

News October 28, 2024

జూనియర్ లెక్చరర్స్ ప్రొవిజినల్ లిస్ట్ విడుదల

image

TG: జూనియర్ లెక్చరర్స్ ప్రొవిజినల్ లిస్ట్‌ను TGPSC విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, ఫిజిక్స్ సబ్జెక్టుల వారీగా JL లిస్టును <>వెబ్‌సైట్‌లో<<>> చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1,392 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వగా, సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించారు.

News October 28, 2024

జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని Xలో రాసుకొచ్చింది. ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మని దింపేసిన సైకో కొడుకు జగన్ ఆమెను ఇంట్లోంచి కూడా గెంటేశాడు. ఇప్పుడు ఏకంగా కేసు పెట్టి కోర్టుకి లాగాడు. 70 ఏళ్ల వయసులో ఏ తల్లికీ ఇంత క్షోభ ఉండదు’ అని ట్వీట్ చేసింది.

News October 28, 2024

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ భాగస్వామి RAILOFY రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దూర ప్రయాణాలలో దీని ద్వారా పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా +917441111266 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. నచ్చిన భాషను ఎంచుకొని వివరాలతో పాటు డెలివరీ స్టేషన్ ఎంచుకోవాలి. సమీపంలో రెస్టారెంట్‌ను సెలక్ట్ చేసి ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు.

News October 28, 2024

మా అమ్మ ఏఎన్నార్‌కు వీరాభిమాని: చిరంజీవి

image

నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు తన తల్లి అంజనా దేవి వీరాభిమాని అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఏఎన్నార్ ఫ్యాన్స్‌లో సీనియర్ ఫ్యాన్ మా అమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమా విడుదలైంది. అమ్మ నిండు గర్భిణిగా ఉన్నా తన బలవంతం మీద నాన్న జట్కా బండిలో సినిమాకు తీసుకెళ్లారు. దారిలో బండి తిరగబడినా సినిమా చూశాకే తిరిగి ఇంటికి వచ్చారు. ఏఎన్నార్ అంటే అమ్మకు అంత పిచ్చి ఉండేది’ అని వెల్లడించారు.

News October 28, 2024

కుటుంబంలో చీలిక తెచ్చారు.. శరద్ పవార్‌పై అజిత్‌ ఫైర్

image

బారామ‌తిలో త‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రొక‌రిని పోటీకి దింపి శ‌ర‌ద్ ప‌వార్ కుటుంబంలో చీలిక తెచ్చార‌ని Dy.CM అజిత్ ప‌వార్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నిక‌ల్లో బారామ‌తి నుంచి త‌న భార్య‌ను పోటీకి దింపి త‌ప్పు చేసినట్టు అంగీక‌రించాన‌ని, అయితే ఇప్పుడు ఇత‌రులు కూడా త‌ప్పు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంద‌న్నారు. అజిత్ సోమవారం నామినేషన్ వేశారు. అజిత్‌కు వ్య‌తిరేకంగా మ‌న‌వ‌డు యుగేంద్రను శ‌ర‌ద్ ప‌వార్‌ రంగంలోకి దింపారు.

News October 28, 2024

వారిని గద్దె దింపేందుకు ఐక్యంగా పనిచేద్దాం: అఖిలేశ్ యాదవ్

image

మహారాష్ట్రలో మహాయుతి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపేందుకు స‌మ‌ష్టి వ్యూహాన్ని ర‌చించ‌డానికి ఐక్యంగా ప‌నిచేయాల‌ని MVA మిత్ర‌ప‌క్షాల‌కు SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌ సూచించారు. బీజేపీ, అజిత్ ప‌వార్‌, షిండేల‌ను రాష్ట్ర శ‌త్రువులుగా అభివర్ణించారు. వీరిని ఓడించి సానుకూల మార్పు తీసుకొస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నిక‌లు మ‌త‌త‌త్వ, వెన్నుపోటు రాజ‌కీయాల నుంచి MHకు విముక్తి క‌ల్పిస్తాయ‌ని పోస్ట్ చేశారు.