India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఆయన రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. తొలుత CM చంద్రబాబు, Dy.CM పవన్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లోని సభాస్థలి వద్దకు చేరుకుంటారు. సా.4.15 గంటలకు విశాఖ చేరుకోనున్న PM బహిరంగ సభ, శంకుస్థాపనలు ముగించుకొని రా.7.15ప్రాంతంలో తిరుగు పయనమవుతారు.
పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఈనెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ సహా ఇతర డిమాండ్ల సాధనకు రైతులంతా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. కాగా రైతునేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ సరిహద్దులో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.
మహరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది APR 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అటు ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ విధానాన్ని NHAI పకడ్బందీగా అమలు చేస్తోంది. ఒకే ఫాస్టాగ్ మల్టిపుల్ వెహికల్స్‌కు వాడటం, పలు పాస్టాగ్లు ఒకే వాహనానికి వినియోగించడాన్ని అరికట్టడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా తప్పించుకోలేడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
భార్య ధనశ్రీతో క్రికెటర్ చాహల్ విడాకుల రూమర్లకు ఇంకా తెరపడటం లేదు. దీనిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. అయితే తాజాగా చాహల్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అన్ని శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినేవారికి అది ఎంతో అందమైన మెలోడిలా అనిపిస్తుంది’ అన్న సోక్రటీస్ మాటలను కోట్ చేశారు. దీంతో చాహల్ పోస్ట్‌కు అర్థమేమై ఉంటుందని అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
‘పుష్ప-2’కు మ్యూజిక్ ఇచ్చానని గతంలో చేసిన వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో BGM ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నంబర్ తీసుకున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో సామ్ సి అందించిన BGMను తీసుకున్నారు.
AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి భవితవ్యం మారిపోయింది. లక్నోకు చెందిన రాకేశ్‌ను మూడేళ్ల క్రితం ఎవరో చెత్తకుప్పలో పడేశారు. స్థానికులు గుర్తించి శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. తరచూ లక్నోకు వచ్చివెళ్తున్న అమెరికన్ దంపతులు బాలుడి విషయం తెలుసుకొని దత్తత తీసుకున్నారు. పాస్‌పోర్టు ప్రక్రియ పూర్తవగానే బాలుడిని వారు US తీసుకెళ్లనున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి USలో పెద్ద సంస్థకు CEO అని తెలుస్తోంది.
ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్<<>> వి.నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. పాఠశాల విద్యాభ్యాసమంతా తమిళ్ మీడియంలోనే చదివారు. అనంతరం IIT ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ ఇన్ క్రయోజెనిక్ ఇజినీరింగ్ చేశారు. ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. తర్వాత IIT ఖరగ్‌పూర్‌లోనే ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD పూర్తి చేశారు. ఈక్రమంలోనే రాకెట్ అండ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ విభాగంలో నారాయణన్ ఆరితేరారు.
Sorry, no posts matched your criteria.