news

News November 4, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి ఎలా చేయాలి?

image

☛వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి.
☛ మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.

News November 4, 2025

కంపెనీకే 17ఏళ్ల జీవితాన్ని అంకితమిస్తే.. ఉద్యోగి ట్వీట్ వైరల్

image

అవిశ్రాంతంగా 17ఏళ్లు పనిచేసినా లేఆఫ్ ఇవ్వడంతో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘లేఆఫ్ బాధలో ఉన్న నేను పిల్లలను తొలిసారి స్కూల్‌కి తీసుకెళ్లా. అప్పుడు వారి నవ్వు చూసి నేను కోల్పోయిన సమయాన్ని గుర్తుచేసుకుంటే కన్నీళ్లు వచ్చాయి. కంపెనీలు త్యాగాలకు కాదు పనితీరుకే విలువనిస్తాయి’ అని రాసుకొచ్చారు. జీతమే ముఖ్యం కాదని, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

News November 4, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ఏరియాల్లోనూ వాన పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 4, 2025

122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>NPCIL<<>>) 122 డిప్యూటీ మేనేజర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు నెలకు రూ.35,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in

News November 4, 2025

మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

image

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్‌కు ఇవ్వలేదు.

News November 4, 2025

రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

image

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్‌ను సాధించడం తెలిసిందే.

News November 4, 2025

ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఆహారపదార్థాలను పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ కంటైనర్లపై ప్లాస్టిక్ కంటైనర్ల food-grade/ BPA-free అని ఉంటేనే వాడాలి. వాటిలో వేడి పదార్థాలు వేయకూడదు. పగుళ్లు, గీతలున్న ప్లాస్టిక్ వస్తువులు వాడకపోవడమే మంచిది. PETE రకం ప్లాస్టిక్ డబ్బాలను ఒకట్రెండు సార్లు మాత్రమే వాడాలని చెబుతున్నారు.

News November 4, 2025

ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

image

ఆధార్‌ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> మీ ఆధార్ నంబర్ లేదా EIDతో లాగిన్ అవ్వాలి. OTP ద్వారా ధ్రువీకరించి రూ.50 చెల్లిస్తే చాలు ఈ కార్డు ఇంటికే వస్తుంది. SHARE IT

News November 4, 2025

CSIR-NIOలో 24 ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<>NIO<<>>) 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ (ఆర్కియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, BZC) ఉత్తీర్ణులు DEC 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు ఫీజులేదు. వెబ్‌సైట్: https://www.nio.res.in

News November 4, 2025

నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

image

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవ‌ద్ద‌నే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిల‌కు తాళి ఉన్న‌ట్లు అబ్బాయిల‌కు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివ‌క్ష లాంటిదే’ అని చెప్పారు.