news

News March 16, 2024

పెళ్లి చేసుకున్న హీరోయిన్

image

హీరోయిన్ కృతి ఖర్బందా వివాహం చేసుకున్నారు. ఆమె మెడలో పుల్కిత్ సామ్రాట్ మూడు ముళ్లు వేశారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. హరియాణాలోని మనేసార్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పంజాబీ స్టైల్‌లో ఘనంగా జరిగింది. కాగా ఈమె తెలుగులో తీన్‌మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D, బ్రూస్‌లీ వంటి సినిమాల్లో నటించారు.

News March 16, 2024

మరికాసేపట్లో ఎన్నికల షెడ్యూల్.. WAY2NEWSలో LIVE

image

దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో ఈసీ షెడ్యూల్ ప్రకటించనుంది. నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్ తేదీలు, ఎన్ని విడతల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారనే విషయాన్ని వెల్లడించనుంది. ఇక షెడ్యూల్ విడుదలతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈసీ ప్రకటనను WAY2NEWSలో లైవ్ చూడొచ్చు.

News March 16, 2024

త్యాగమూర్తి పొట్టిశ్రీరాములు జయంతి నేడు

image

స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952 OCT 10 నుంచి 58 రోజుల పాటు ఆయన మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ధీరోదాత్త ఆత్మత్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణ. 1953 OCT 1న కర్నూలు జిల్లా రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 2008లో నెల్లూరు జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

News March 16, 2024

పార్లమెంట్ టు అసెంబ్లీ.. అసెంబ్లీ టు పార్లమెంట్

image

AP: 2014లో MLAలుగా గెలిచిన వారు ఎంపీలుగా, MPలు ఎమ్మెల్యేలుగా ఈసారి YCP నుంచి పోటీ చేయనున్నారు. పొన్నూరు MLA కిలారు రోశయ్య- గుంటూరు MP, చంద్రగిరి MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- ఒంగోలు MP, రాజోలు MLA వరప్రసాద్- అమలాపురం MP, నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్- నరసరావుపేట MP, రాజమండ్రి MP భరత్- రాజమండ్రి సిటీ MLA, కాకినాడ MP వంగా గీత- పిఠాపురం MLA, నెల్లూరు MP ప్రభాకర్‌రెడ్డి- నెల్లూరు రూరల్ MLA.

News March 16, 2024

EC కౌంట్‌డౌన్.. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2..

image

దేశంలో ఎన్నికల పండుగ ప్రకటనకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10ని.లో భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను CEC రాజీవ్ కుమార్ వెల్లడించనున్నారు. అటు పలు చోట్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల బైపోల్ షెడ్యూల్ కూడా ఇందులో ఉంటుంది.
– ఎన్నికల షెడ్యూల్ లైవ్ అప్‌డేట్స్, ఆసక్తికర కథనాలు ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో పొందవచ్చు.

News March 16, 2024

కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

image

TG: బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

News March 16, 2024

తెలంగాణలో ఓటు అడిగే అర్హత మోదీకి లేదు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రానికి PM మోదీ చేసిందేమి లేదని CM రేవంత్ అన్నారు. ‘తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి పాలనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి డ్రామాకు తెరలేపారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఊరుకుంటామా? బీఆర్ఎస్-బీజేపీ కుట్ర చేస్తే తప్పా.. వారు అనుకుంటున్నది సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

కవిత పిటిషన్‌పై తీర్పు రిజర్వు

image

కవిత రిమాండ్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో కవితను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వాదించింది. ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే ఇప్పటికే న్యాయస్థానంలో తన పిటిషన్ విచారణలో ఉండగానే తనను అరెస్టు చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును సాయంత్రం గం.4:30కి రిజర్వు చేసింది.

News March 16, 2024

భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 1/2

image

సూర్యుడి చుట్టూ పరిభ్రమణంతో భూమి వాతావరణం మారుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ వాతావరణంపై మార్స్ ప్రభావం కూడా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. పరిభ్రమణం, కక్ష్యలో మార్పుల వల్ల ప్రతీ 24లక్షల ఏళ్లకు ఓసారి భూమి, మార్స్ దగ్గరగా వస్తాయట. ఈ క్రమంలో ఇరు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఒకదానిపై మరోటి ప్రభావం చూపిస్తాయట. ఫలితంగా భూ వాతావరణం మారుతుందట. దీనిని గ్రాండ్ సైకిల్‌ అంటారు.

News March 16, 2024

భూ వాతావరణంపై మార్స్ ప్రభావం! – 2/2

image

ఈ అరుదైన ఘటనతో 24లక్షల ఏళ్లకు ఓసారి భూ వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయట. ఓ గ్రాండ్ సైకిల్‌లో భూమికి ఎక్కువ సూర్యకాంతి తగులుతూ, తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే మరో సైకిల్‌లో సూర్యకాంతి తగ్గి, శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. భూ అవక్షేపాలపై పరిశోధనతో ఈ విషయాలను కనుగొన్నారు. సముద్ర గర్భాన మార్పులు, గతకొన్నేళ్లలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తమ పరిశోధనకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.