news

News January 8, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు శ్రీవారి రథం బయల్దేరింది.

News January 8, 2025

నేను వచ్చేలోపు వాళ్లను వదిలేయాలి: ట్రంప్ వార్నింగ్

image

గాజాలోని హమాస్ లీడర్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి (జనవరి 20) ముందే బందీలను వదిలిపెట్టాలని స్పష్టం చేశారు. లేదంటే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు. కాగా అమెరికా బందీలను విడిచిపెట్టేందుకు అగ్రరాజ్య ప్రతినిధులతో హమాస్ చర్చలు కొనసాగుతున్నాయి.

News January 8, 2025

హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు!.. అందరూ డిశ్చార్జ్!

image

HYDలో గతేడాది DECలోనే hMPV కేసులు నమోదైనట్లు ఓ ప్రైవేట్ ల్యాబ్ వెల్లడించింది. 258 మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు చేయగా 11 శాంపిల్స్‌లో hMPV పాజిటివ్ అని తేలిందని మణి మైక్రో బయాలజీ ల్యాబ్ తెలిపింది. వారు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఈ వైరస్ కొత్తదేం కాదని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. hMPV ఇండియాలో ఎప్పటి నుంచో ఉందని ICMR కూడా వెల్లడించిందని వివరించింది.

News January 8, 2025

లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్

image

లోన్లపై వడ్డీరేట్లకు సంబంధించి కస్టమర్లకు HDFC ఉపశమనం కలిగించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం HDFC MCLR 9.15% నుంచి 9.45% వరకు ఉన్నాయి. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. MCLRను బట్టే బ్యాంకులు వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.

News January 8, 2025

ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు ఉండవా?

image

AP: ఇంటర్మీడియట్‌లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌‌లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. మొదటి ఏడాది అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనుంది.

News January 8, 2025

మరో అమ్మాయితో చాహల్ (PHOTO)

image

ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించారు. ఆ యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందు వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో చాహల్ ఈ వార్తలను కొట్టిపారేశారు.

News January 8, 2025

సర్టిఫికెట్లు ఆపితే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు!

image

AP: అడ్మిషన్ల వేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఆపుతున్నట్లు ఫిర్యాదులు రావడంపై కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఫీజుల వసూలు, రీయింబర్స్‌మెంట్ వర్తించే వారినీ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. అడ్మిషన్‌ తీసుకున్న తర్వాత వద్దనుకుంటే 5% మినహాయించి 15 రోజుల్లో కట్టిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది.

News January 8, 2025

జులై నుంచి చిరంజీవి-అనిల్ మూవీ షూటింగ్?

image

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.

News January 8, 2025

ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ

image

TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

News January 8, 2025

స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!

image

చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.