news

News March 22, 2024

కాళేశ్వరంపై కొనసాగుతోన్న NDSA విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాలపై NDSA బృందం విచారణ కొనసాగుతోంది. బ్యారేజీ నిర్మాణాల్లో లోపాలతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ గత 2 రోజులుగా విచారిస్తోంది. బ్యారేజీల డిజైన్లలో తేడాలెందుకు ఉన్నాయని, పనుల ప్రారంభానికి ముందు భూగర్భ పరీక్షల్లో ఏమేం గుర్తించారని ప్రశ్నించింది. ఇవాళ చివరి రోజు రాష్ట్ర డ్యామ్ కమిటీతో భేటీ కానుంది.

News March 22, 2024

TDP ఎంపీ అభ్యర్థుల జాబితా..

image

✒ శ్రీకాకుళం- రామ్మోహన్, ✒ విశాఖ- భరత్
✒ అమలాపురం- హరీశ్ ✒ ఏలూరు- మహేశ్ యాదవ్
✒ విజయవాడ కేశినేని చిన్ని ✒ గుంటూరు- పి.చంద్రశేఖర్
✒ నరసరావుపేట- లావు శ్రీకృష్ణదేవరాయలు
✒ బాపట్ల- టి.కృష్ణప్రసాద్, ✒ నెల్లూరు- వేమిరెడ్డి
✒ చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
✒ కర్నూలు- పంచలింగాల నాగరాజు
✒ నంద్యాల- బైరెడ్డి శబరి
✒ హిందూపురం- బీకే పార్థసారథి

News March 22, 2024

BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల

image

AP: ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 11 MLA, 13 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పలాస- గౌతు శిరీష, పాత పట్నం- గోవిందరావు, శ్రీకాకుళం- గోండు శంకర్, Sకోట- కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం-ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-కృష్ణ ప్రసాద్, నరసరావుపేట-అరవింద్‌బాబు, చీరాల- మాలకొండయ్య, సర్వేపల్లి-సోమిరెడ్డి.

News March 22, 2024

ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం.. ఇద్దరు సస్పెండ్

image

AP: ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయడంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏలూరు(D) ఉంగుటూరు మండలం రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్‌కు పార్టీ రంగులు ఉన్నాయంటూ స్థానికుడు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తెల్లరంగు వేయించారు. అయితే అతడి వివరాలు స్థానిక నాయకులకు చేరవేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో.. కలెక్టర్ స్పందించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

News March 22, 2024

REWIND: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు

image

కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగింది. వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.

News March 22, 2024

రేపు బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల?

image

BJP లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముంది. రేపు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆరూరి రమేశ్‌కు WGL టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు APలో పోటీ చేసే అభ్యర్థులను కూడా రేపు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

News March 22, 2024

తెలుగోడి సత్తా ఏంటో చూపనున్నారు!

image

మరికొన్ని గంటల్లో IPL-2024 సమరం మొదలుకానుంది. అయితే, ఈ సీజన్‌లో తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఏడుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, రిక్కీ, ఆరవెల్లి అవినాశ్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

News March 22, 2024

IPL: ఇవాళ గెలిచేది ఎవరు?

image

IPL-2024లో భాగంగా ఇవాళ చెపాక్ మైదానంలో CSK, RCB మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచులు గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్ మ్యాచులన్నీ జియో సినిమా యాప్(ఫ్రీ), స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో ప్రసారం కానున్నాయి. ఇవాళ్టి మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

ఈ ఔషధం ఖరీదు రూ.35 కోట్లు..

image

పిల్లల్లో జన్యుపరమైన లోపంతో వచ్చే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ(MLD) అనే అరుదైన వ్యాధికి ఆర్చర్డ్ థెరప్యూటిక్(US) సంస్థ ఔషధాన్ని తయారుచేసింది. ‘లెన్మెల్డీ’ అని పిలిచే ఈ డ్రగ్ ఖరీదు రూ.35 కోట్లు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఔషధంగా నిలిచింది. MLD వల్ల మెదడు, నాడీ వ్యవస్థలో ఎంజైమ్స్ లోపం తలెత్తుతుంది. ఎదుగుదల ఆలస్యమవడం, కండరాల బలహీనత సమస్యలు వస్తాయి. తొలి దశలోనే గుర్తిస్తే లెన్మెల్డీతో నయం చేయొచ్చు.

News March 22, 2024

దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయంటే?

image

దేశంలో దాదాపు 2600కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో గుర్తింపు లేని పార్టీలే (2,597) ఎక్కువ. 57 స్టేట్ పార్టీలు, 6 జాతీయ పార్టీలు (BJP, కాంగ్రెస్, BSP, CPM, నేషనల్ పీపుల్స్ పార్టీ, AAP) ఉన్నాయి. 1951లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వాటిలో 14 జాతీయ పార్టీలుండగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 6 మాత్రమే పోటీలో ఉండనున్నాయి. అప్పటితో పోలిస్తే దేశంలో నేషనల్ పార్టీల సంఖ్య తగ్గింది.