India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు. అదే దేశానికి చెందిన సోఫియా అల్లౌకేను పెళ్లాడారు. రెండు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్న వాంగ్, అల్లౌకే అడిలైడ్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోను వాంగ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.
TG: రాష్ట్ర ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారా? అని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కేసులో ఆమె అరెస్టయ్యారని, ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో NDA 400+ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి <
చీలమండపై గాయం కారణంగా వరల్డ్ కప్-2023 నుంచి వైదొలగడంపై టీమ్ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను 5 రోజుల తర్వాత తిరిగి వస్తానని మేనేజ్‌మెంట్‌కి చెప్పాను. కానీ చీలిమండపై 3 చోట్ల ఇంజెక్షన్స్ ఇచ్చారు. అక్కడ రక్తం కూడా తీశారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడేందుకు పది రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా. పూర్తిగా కోలుకునేందుకు 3 నెలలు పట్టింది’ అని తెలిపారు.
TG: బీఆర్ఎస్ తరఫున 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్‌కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు ఎంపీలే ఉన్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌కి మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ. బాక్సాఫీస్ ముందు ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ-2 కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. త్వరలో కార్తికేయ-3 కూడా రాబోతోందని తాజాగా హీరో నిఖిల్ పోస్ట్ పెట్టారు. ‘డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్‌ని వెతుకుతున్నాడు’ అని ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
TG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలకు రూ.500, ఇంటర్‌కు రూ.1000 చొప్పున ఆలస్య రుసుముతో ఈనెల 18 నుంచి 21 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. డీఈవోల వద్ద ఈనెల 22 వరకు, ప్రధాన కార్యాలయంలో ఈనెల 23 వరకు చెల్లించవచ్చని సూచించారు.
TG: BRS పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీలోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కాసేపటి క్రితం అన్నారు.
TG: గత పాలకులు చేసిన తప్పులకు ఎలాంటి శిక్షలుంటాయని ఎదురైన ప్రశ్నకు సీఎం రేవంత్ స్పందించారు. ‘ఓటమే వారికి పెద్ద శిక్ష. ఆ దెబ్బకు కిందపడి విరగడం కూడా మీరు చూశారు. అంతకంటే పెద్దశిక్ష ఏం ఉంటుంది. ఇంకా బలమైన శిక్షలేమైనా ఉంటే మీరే(రిపోర్టర్) సూచించాలి. అమరవీరుల స్తూపం వద్ద రాళ్లతో కొట్టించమంటారా?. మీ సూచనను ప్రభుత్వం పరిశీలిస్తుంది(నవ్వుతూ)’ అని రేవంత్ అన్నారు.
TG: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎంపీ రంజిత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు హస్తం పార్టీ చేవెళ్ల లోక్ సభ సీటును కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తొలుత పట్నం సునీతారెడ్డికి ఈ సీటును ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రంజిత్‌రెడ్డి చేరికతో ఆమెను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించిందట.
Sorry, no posts matched your criteria.