India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.
ఎన్నిరకాల వంటలున్నా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరికైతే రోజువారీ ఆహారంలో బిర్యానీ భాగమైంది. సిటీలోని 1,700కుపైగా రెస్టారెంట్ల నుంచి ఏడాదిలో 1.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది. సెకనుకు 2.3 బిర్యానీలను కొనుగోలు చేశారని తెలిపింది. మీలో ఎంతమందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం?
భారతీయ రైల్వే విడుదల చేసిన 9,144 రైల్వే ఉద్యోగాలకు <
టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు BCCI సెంట్రల్ కాంట్రాక్టు లభించింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్టు ఇస్తున్నట్లు BCCI ప్రకటించింది. గ్రేడ్-సీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు మరో 15 మంది క్రికెటర్లు గ్రేడ్-సీ కాంట్రాక్టులో ఉన్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌తో పాటు మహిళలను ఈడీ ఆఫీసుకు విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది. ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఇవాళ మూడో రోజు ఈడీ ఆమెను పలు అంశాలపై ప్రశ్నించనుంది.
AP: రాష్ట్రవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 83 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు SEC వెల్లడించింది. 2019లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. పట్టణాలు, ఏజెన్సీల్లో యువతలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనుంది. గత ఎన్నికల్లో అత్యల్పంగా విశాఖ వెస్ట్‌లో 56.3 శాతం పోలింగ్ నమోదైంది.
హౌతీల దాడిలో యూకేకు చెందిన రూబీమార్ అనే వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న 21,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ సముద్రం పాలయ్యాయి. దాదాపు 30 కి.మీ మేర సముద్రంపై చమురు తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో అందులోని జీవరాశులకు ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలకు, పగడపు దిబ్బలకు పర్యావరణ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.
AP: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి <<12880443>>నోటీసులు<<>> ఇవ్వడంపై వైసీపీ Xలో స్పందించింది. ‘టీడీపీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. సీఎం జగన్‌ను అవమానించేలా టీడీపీ Xలో పోస్టు వేసింది. ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్టును డిలీట్ చేసింది. ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్టులు కాదు టీడీపీనే డిలీట్ చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది.
AP: ఈ నెల 22 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారట.
AP: ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా.. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రధాన పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తికాగా.. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రేపటితో అయిపోతాయి.
Sorry, no posts matched your criteria.