news

News April 18, 2025

18th Anniversary: IPL స్పెషల్ పోస్టర్

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమై నేటితో 18 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా IPL X హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘కలలు నిజమయ్యాయి.. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘18 ఏళ్ల IPL జర్నీపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండి?’ అని ఫ్యాన్స్‌ను కోరింది. COMMENT

News April 18, 2025

‘ఫ్రెంచ్ ఓపెన్‌’లో నాదల్‌కు సన్మానం

image

వచ్చే నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆరోజున తమ దేశపు ఆటగాడు, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు సన్మానం చేయాలని నిర్ణయించినట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గిల్లెస్ మోరెటాన్ ప్రకటించారు. ‘రోలాండ్ గారోస్‌లో నాదల్‌కు మరెవరూ సాటిలేరు. ఇక్కడ ఆయన 14 టైటిళ్లు గెలిచారు. ఈ ఏడాది టోర్నమెంట్ ఆడకపోయినా ఆయన మాతో ఉంటారు. ఫ్రెంచ్ ఓపెన్‌కు రఫా ఓ గొప్ప రాయబారి’ అని ఆయన తెలిపారు.

News April 18, 2025

IPL: అరేయ్ ఏంట్రా ఇది!

image

ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఇదే జట్ల మధ్య ఒక్క రోజు గ్యాప్‌తో ఎల్లుండి మరోసారి చండీగఢ్‌లో మ్యాచ్ ఉంది. ఈ షెడ్యూల్ చూసి క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. మధ్యలో ఉన్న ఆ ఒక్క రోజు కూడా ట్రావెలింగ్‌కు కేటాయించారు. దీంతో గ్యాప్ ఇవ్వకుండా అవే జట్లకు వరుసగా మ్యాచులు పెట్టడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

News April 18, 2025

టెన్త్, ఐటీఐ అర్హతతో NCLలో 200 ఉద్యోగాలు

image

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌(NCL)లో 200 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్‌తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైనవారు అర్హులు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. OBC/EWS/UR అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రూ.1,180(మిగతా కేటగిరీలకు మినహాయింపు). CBT ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.nclcil.in/<<>>

News April 18, 2025

BRS నేతలతో కేసీఆర్ సమావేశం

image

TG: బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 18, 2025

జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నారా?

image

కొందరు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు తినేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్‌లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. అలాగే డెయిరీ పదార్థాలు, గుడ్లు ఎక్కువగా తిన్నా జంక్ ఫుడ్‌పైకి మనసు వెళ్లదు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినాలనే కోరికలు నియంత్రణలో ఉంటాయి.

News April 18, 2025

మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

image

AP: PM మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.

News April 18, 2025

అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

image

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.

News April 18, 2025

జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.nic.in/<<>> వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. నిన్న రాత్రి ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో ఉంచి వెంటనే డిలీట్ చేసిన విషయం తెలిసిందే. కీలో తప్పులు దొర్లడంతో తొలగించినట్లు సమాచారం.

News April 18, 2025

MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

image

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.

error: Content is protected !!