news

News March 17, 2024

రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదు: రాహుల్

image

బీజేపీ కేవలం హడావుడి పార్టీ అని, దేశ రాజ్యాంగాన్నే మార్చేంత ధైర్యం దానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదు. రెండు సిద్ధాంతాల మధ్య. ప్రజల మద్దతు, నిజం మా వైపు ఉన్నాయి. నిరుద్యోగులకు, కార్మిక కర్షకులకు ఏ జ్ఞానం ఉండదని బీజేపీ నేతలు అనుకుంటారు. అధికారమంతా ఒకేచోట ఉంచాలని భావిస్తారు. అధికార వికేంద్రీకరణ మా విధానం’ అని పేర్కొన్నారు.

News March 17, 2024

రూ.10వేల కోట్లతో విశాఖను గొప్ప రాజధానిగా చేయొచ్చు: బొత్స

image

AP: అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే 3 రాజధానుల ప్రతిపాదన చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎవరిమీదో కక్షతోనో విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ‘గత పాలకులు ₹1.19 లక్షల కోట్లతో అమరావతి నిర్మాణ ప్రణాళిక వేసి.. 15ఏళ్లలో ₹20 లక్షల కోట్లకు పెంచే ప్రయత్నం చేశారు. ఇంత ఖర్చుతో రాజధాని అవసరమా? ₹10వేల కోట్లతో విశాఖను దేశంలోనే గొప్ప రాజధానిగా చేయొచ్చు’ అని తెలిపారు.

News March 17, 2024

కోహ్లీకి రోహిత్ మద్దతు?

image

T20WCలో చోటుపై విరాట్ కోహ్లీకి.. కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జూన్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీకి అతడు భారత జట్టులో ఉండాల్సిందేనని హిట్‌మ్యాన్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. పలువురు సెలక్టర్లు మూడో స్థానంలో ఇషాన్‌ను ఆడించాలని యోచిస్తుండగా రోహిత్ మాత్రం కోహ్లీ వైపు మొగ్గు చూపుతున్నారట. వరల్డ్ కప్‌లో విరాట్ స్థానంపై త్వరలోనే సెలక్టర్లు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

News March 17, 2024

YELLOW ALERT.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

TS: పలు జిల్లాల్లో రేపు ఉ.8.30 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, KMR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లో 30-40KM వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది. అటు NZB, జగిత్యాల, సిరిసిల్ల, VKB, SRD, MDK, KMRD జిల్లాల్లో వర్షాలు, వడగండ్లు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

News March 17, 2024

స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి

image

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ స్వలింగ వివాహం చేసుకున్నారు. అదే దేశానికి చెందిన సోఫియా అల్లౌకేను పెళ్లాడారు. రెండు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్న వాంగ్, అల్లౌకే అడిలైడ్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోను వాంగ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. కాగా ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.

News March 17, 2024

కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారా? అని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కేసులో ఆమె అరెస్టయ్యారని, ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో NDA 400+ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News March 17, 2024

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి <>నోటిఫికేషన్<<>> విడుదల చేసింది. ఇందులో ఫిమేల్ స్టాఫ్ నర్స్ 121, మెస్ హెల్పర్ 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ల్యాబ్ అటెండెంట్ 161 సహా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులను భట్టి టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నాయి. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు వెల్లడి కానున్నాయి.

News March 17, 2024

5 రోజుల్లో వస్తానని చెప్పా.. 3 నెలలు పట్టింది: పాండ్య

image

చీలమండపై గాయం కారణంగా వరల్డ్ కప్-2023 నుంచి వైదొలగడంపై టీమ్ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను 5 రోజుల తర్వాత తిరిగి వస్తానని మేనేజ్‌మెంట్‌కి చెప్పాను. కానీ చీలిమండపై 3 చోట్ల ఇంజెక్షన్స్ ఇచ్చారు. అక్కడ రక్తం కూడా తీశారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడేందుకు పది రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా. పూర్తిగా కోలుకునేందుకు 3 నెలలు పట్టింది’ అని తెలిపారు.

News March 17, 2024

BRSను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

image

TG: బీఆర్ఎస్ తరఫున 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్‌కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం నలుగురు ఎంపీలే ఉన్నారు.

News March 17, 2024

‘కార్తికేయ-3’పై అప్డేట్ ఇచ్చిన నిఖిల్

image

సస్పెన్స్ థ్రిల్లర్‌కి మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ. బాక్సాఫీస్ ముందు ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ-2 కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. త్వరలో కార్తికేయ-3 కూడా రాబోతోందని తాజాగా హీరో నిఖిల్ పోస్ట్ పెట్టారు. ‘డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్‌ని వెతుకుతున్నాడు’ అని ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.