news

News March 16, 2024

BREAKING: కవితకు హైబీపీ

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితకు హైబీపీ ఉందని ఆమె లాయర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి రక్తపోటు లేదని కోర్టుకు వెల్లడించారు. ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ కారణంగా ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 7 రోజుల ED కస్టడీలో అవసరమైన మెడిసిన్, దుస్తులు, ఫుడ్ అందించవచ్చని లాయర్‌కు తెలిపింది.

News March 16, 2024

క్రిమినల్ కేసులుంటే పార్టీ వెబ్‌‌సైట్‌లో వివరాలు పెట్టాలి: CEC

image

AP: అభ్యర్థులు క్రిమినల్ కేసులుంటే పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర CEC ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘క్రిమినల్ కేసులుంటే ఆయా పార్టీల వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచాలి. రాష్ట్రంలో 46 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత పెంచుతాం. 4లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు.

News March 16, 2024

కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.

News March 16, 2024

అమల్లోకి ఎన్నికల కోడ్.. వీటిని మరవద్దు!

image

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు, నాయకులు తమ ప్రత్యర్థుల పనితీరుపైనే విమర్శలు చేయాలి. కులం, మతం, జాతి ఆధారంగా ఆరోపణలు చేయకూడదు. అనధికార పత్రాలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయకూడదు. ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు ఇవ్వొద్దు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటరును ప్రభావితం చేసేలా ఏ పథకాన్ని ప్రకటించొద్దు. ఇలాంటివి చేస్తే వారికి శిక్ష విధించే అధికారం ఈసీకి ఉంది.

News March 16, 2024

ప్రభాస్ ‘కల్కి’ సినిమాకు ఎన్నికల ఎఫెక్ట్

image

హీరో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేయకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.

News March 16, 2024

మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు.. APPLY చేసుకోండి

image

ఏపీలోని 164 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ స్కూళ్లలో బోధన పూర్తిగా ఉచితం. CBSE సిలబస్, ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. ఐదో తరగతి పూర్తైన విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించి, అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తారు. చివరి తేదీ: మార్చి 31. ఎంట్రన్స్ టెస్ట్: ఏప్రిల్ 21. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం. పూర్తి వివరాలకు: https://apms.apcfss.in/

News March 16, 2024

ఎలక్టోరల్ ట్రస్టులు కూడా బీజేపీకి ఫేవర్‌గానే! – 1/2

image

ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు ఎలక్టోరల్ ట్రస్టుల విరాళాలూ ఎక్కువగా బీజేపీకే అందినట్లు తెలుస్తోంది. 2022-23లో ఐదు ట్రస్టులు పార్టీలకు రూ.366కోట్లు ఇవ్వగా.. వీటిలో రూ.259కోట్లు బీజేపీకే వెళ్లాయి. అత్యధిక బాండ్స్ విరాళమిచ్చిన సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న మేఘా ఇంజినీరింగ్ ప్రూడెంట్‌కు (బీజేపీ మద్దతుదారు) రూ.87కోట్లు ఇచ్చింది. FY17 నుంచి ప్రూడెంట్‌కు వచ్చిన కార్పొరేట్ డొనేషన్లలో 85% బీజేపీకే వెళ్లాయి.

News March 16, 2024

ఎలక్టోరల్ ట్రస్టులు కూడా బీజేపీకి ఫేవర్‌గానే! – 2/2

image

ఇదే తరహాలో బడా కంపెనీలు నిధులిచ్చే అనేక ఎలక్టోరల్ ట్రస్టులు సైతం బీజేపీకి భారీగా ఫండ్స్ ఇచ్చాయి. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్‌ను 2013లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్‌కు చెందిన వ్యక్తులు/కంపెనీలు డొనేట్ చేయొచ్చు. దాతల వివరాలు ఈసీకి కచ్చితంగా వెల్లడించాలనే నిబంధన ఉండటంతో ట్రస్టుల్లో బాండ్స్ కంటే ఎక్కువ పారదర్శకత ఉంటుంది.

News March 16, 2024

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ట్రాక్ రికార్డు బాగుంది. మేం చేసిన పనులే గెలిపిస్తాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. అబ్‌కి బార్ 400 పార్. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈసారి కూడా వాళ్లకు ఓటమి తప్పదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 16, 2024

జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో మే 13న ఎన్నికల జరగనుండటంపై TDP చీఫ్ చంద్రబాబు స్పందించారు. ‘ఐదేళ్లుగా 5 కోట్ల మంది ఈ రోజు కోసమే ఎదురుచూశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక పోలింగే మిగిలింది. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు వచ్చింది. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే’ అని ట్వీట్ చేశారు.