news

News January 8, 2025

నెల్లూరు జిల్లా నేతలతో నేడు జగన్ సమావేశం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై ఒక్కో జిల్లా నేతలతో సమావేశం అవుతోన్న విషయం తెలిసిందే.

News January 8, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదేనా!

image

వచ్చే నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కి భారత జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకొని షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. CTలో భారత్ తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్‌తో ఆడనుంది.
జట్టు అంచనా: రోహిత్(C), కోహ్లీ, గిల్, జైస్వాల్, శ్రేయస్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్.

News January 8, 2025

సంక్రాంతి సెలవులు.. ఎవరికి ఎన్నిరోజులంటే?

image

ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ఎప్పుడనే వివరాలు చూద్దాం.
* TGలో స్కూళ్లకు ఈనెల 11-17 వరకు
* జూనియర్ కాలేజీలకు 11-16 వరకు
* APలో స్కూళ్లకు ఈనెల 10-19 వరకు
* క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 11-15 వరకు
* జూనియర్ కాలేజీలకు ఇంకా సెలవులు ప్రకటించలేదు.

News January 8, 2025

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

image

AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.

News January 8, 2025

ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TG: పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ.1000Cr పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920Cr బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News January 8, 2025

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.

News January 8, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్

image

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశామని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు నిన్న ఉదయం శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించిన విషయం తెలిసిందే. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా అతడి తల్లి రేవతి చనిపోయారు.

News January 8, 2025

కుంభమేళాలో తిరుమల శ్రీవారి ఆలయం

image

UPలోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయనున్నట్లు TTD ఈవో శ్యామలరావు తెలిపారు. JAN 13- FEB 26 వరకు కుంభమేళాకు వచ్చే కోట్లాది మందికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి గుడికి సమీపంలో 2.89ఎకరాలలో ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలు జరుగుతాయని తెలిపారు.

News January 8, 2025

రేపు అనంతలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

image

AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని టీడీపీ నాయకులు తెలిపారు. అనంతపురంలో బాలయ్య వైబ్ చూడబోతున్నాం అని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

News January 8, 2025

కాంగ్రెస్ కీలక సమావేశం నేడు

image

TG: గాంధీభవన్‌లో ఇవాళ PCC రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశం జరగనుంది. AICC జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా రేవంత్, భట్టి, పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఏడాది పాలనలో ప్రజల్లో స్పందన, గ్యారంటీల అమలు తీరు, రానున్న 4 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు.