India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అమరావతి రైతులపై కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళల విజ్ఞప్తి చేశారు. రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన హోం మంత్రి అనిత న్యాయం చేస్తామని వారికి హామీనిచ్చారు.
‘యోగా’ అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. అప్పట్లో దీనిని ‘యుజ్’ అనేవారు. కాలక్రమేణా ఇది ‘యోగా’గా మారింది. దీనర్థం ఏకం చేయడం లేదా ఓకే దగ్గరకు చేర్చడం. అంటే మనసు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. బరువులు ఎత్తకుండా, పరుగులు పెట్టకుండా చేసే వ్యాయామం. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే దీని ఉద్దేశం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.
TG: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఆగస్టు 15కల్లా రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటన నేపథ్యంలో విధివిధానాలు, అర్హతలపై చర్చించే అవకాశముంది. రైతు భరోసా విషయంలోనూ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
TG: ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 60,673 మంది చిన్నారులే ప్రవేశం పొందినట్లు తెలిపింది. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ సూళ్లలో సగటున క్లాసుకు 1.90 లక్షల మంది విద్యార్థులుండగా, ఇంత తక్కువ ప్రవేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు వరకు ప్రవేశాలకు అవకాశమున్నా ఇంకా లక్ష మంది చేరేది సందేహంగానే ఉంది.
దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన మ్యాచులకు విశాఖకు చెందిన మహిళా క్రికెటర్ 17 ఏళ్ల షబ్నమ్ షకీల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో ఇంకా ఒక వన్డే, టెస్టు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. దీంతో ఒకేసారి 3 ఫార్మాట్లకు ఎంపికైన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా షబ్నమ్ నిలిచారు. U-19 WC గెలవడంలో కీలక పాత్ర పోషించిన షబ్నమ్ WPLలో గుజరాత్ తరఫున ఆడారు. కాగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది.
AP: నేటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
యూరో ఛాంపియన్‌షిప్-2024లో గ్రూప్-Bలో ఇటలీతో జరిగిన మ్యాచులో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ నాకౌట్‌కు చేరువైంది. మరోవైపు గ్రూప్-సీలో స్లోవేనియాతో సెర్బియా, డెన్మార్క్‌తో ఇంగ్లండ్ మ్యాచులు 1-1తో డ్రాగా ముగిశాయి.
TG: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు మరవలేనివని బీఆర్ఎస్ చీఫ్ స్మరించుకున్నారు. BRS పదేళ్ల పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆస్ట్రియాకు చెందిన మార్లిన్ ఎంగెల్ హార్న్(31) తనకు వారసత్వంగా వచ్చిన సంపద రూ.224 కోట్లు దానం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై గుటెర్ ర్యాట్ అనే నిపుణుల బృందాన్ని మార్లిన్ సంప్రదించారు. ఆ డబ్బును 77 సంస్థలకు పంచుతామని గుటెర్ ర్యాట్ తెలిపింది. సంపద పున:పంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తానని మార్లిన్ తెలిపారు.
ఇంధన, నిత్యావసరాల ధరలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై దుయ్యబట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు దారుణంగా మారాయని దావణగిరెలో మీడియాతో చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌పై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.