news

News June 20, 2024

నెలరోజులపాటు బోనాల పండుగ: పొన్నం

image

TG: ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాం. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.

News June 20, 2024

విద్యార్థులు సైంటిస్టులుగా మారేలా ప్రోత్సాహం అందించాలి: పవన్

image

AP: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్& టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని చెప్పారు. రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

News June 20, 2024

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

image

AP: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

News June 20, 2024

సూర్య సూపర్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ 181/8

image

T20WC సూపర్-8లో అఫ్గాన్‌పై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. సూర్య 28 బంతుల్లో 53 పరుగులతో(3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. రోహిత్ 8, కోహ్లీ 24, పంత్ 20, దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఫరూఖీ 3, నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News June 20, 2024

వైఎస్సార్ బీమా.. చంద్రన్న బీమాగా మార్పు

image

AP: అసంఘటిత రంగంలోని కార్మికులకు అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ తదితర పేర్లను <<13464132>>మార్చిన<<>> విషయం తెలిసిందే.

News June 20, 2024

IT స్టార్టప్‌లలో భారత్‌కు ఆరో స్థానం

image

భారత్‌లోని 3,600 IT స్టార్టప్‌ల ద్వారా గత ఏడాది $850M ఆదాయం వచ్చినట్లు నాస్కామ్ వెల్లడించింది. వాటిలో గత ఏడాదే 480 సంస్థలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రంగంలో IND ఆరో స్థానంలో ఉందని, త్వరలో థర్డ్ ప్లేస్‌కు చేరుకుంటుందని పేర్కొంది. 2014-22 మధ్య AI బేస్డ్ స్టార్టప్‌లు 62% పెరిగాయంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్, రోబోటిక్స్ కేటగిరీల్లో భారీగా స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది.

News June 20, 2024

రేపు కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్‌

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్‌ను రేపు సా.6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన తొలి ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News June 20, 2024

హైదరాబాద్‌లో ‘సెల్యూట్ తెలంగాణ’

image

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో BJP సత్తా చాటిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హైదరాబాద్‌లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీ చేపట్టారు. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొనగా వారికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి.

News June 20, 2024

స్టూడియోల నిర్మాణంపై నిర్మాతలు దృష్టిసారించాలి: మంత్రి కందుల

image

APలో ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని ప్రోత్సహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికారు. సినిమా షూటింగులకు అనుగుణంగా కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదృష్టవశాత్తూ ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు.

News June 20, 2024

స్లో స్టార్ట్.. 3 వికెట్లు కోల్పోయిన భారత్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 9.3ఓవర్లకు 75 రన్స్ చేసింది. రోహిత్(8), పంత్(20), కోహ్లీ(24) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫరూకీ 1, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, దూబే ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభం కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. 6 ఓవర్లలో 47 రన్స్ చేసింది.