news

News June 18, 2024

‘టైం ఇవ్వండి’.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మాలీవాల్ లేఖ

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడటంపై ఇండియా కూటమి నేతలకు AAP ఎంపీ స్వాతి మాలీవాల్ లేఖ రాశారు. ఈ విషయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నేతలను కోరారు. ‘ఈ వ్యవహారంపై మాట్లాడినందుకు నాకు అండగా నిలవాల్సిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను దూషిస్తున్నారు. 8ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా సేవలు అందించిన నాకు ఇలా జరగడం బాధాకరం’ అని పేర్కొన్నారు.

News June 18, 2024

తను నాకు క్రమశిక్షణ నేర్పింది: ఫెదరర్

image

రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వ్యక్తిగా, ఆటగాడిగా తాను మెరుగవడంలో భార్య మిర్కా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆమె వల్లనే తనకు క్రమశిక్షణ అలవడిందన్నారు. కష్టకాలంలో తన వెంటే ఉండి ప్రోత్సహించిందన్నారు. టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కాను 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో రోజర్ తొలిసారి కలుసుకున్నారు.

News June 18, 2024

NEETపై మోదీ మౌనం.. రాహుల్ విమర్శలు

image

NEET వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. బిహార్, గుజరాత్, హరియాణాల్లోనే అరెస్టులు జరిగాయని, పేపర్ లీకులకు BJP పాలిత రాష్ట్రాలు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 24లక్షల విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతున్నా మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారన్నారు. తమ పార్టీ పేపర్ లీకులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించేలా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.

News June 18, 2024

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరి?

image

AP: లోక్‌సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్‌ అభ్యర్థిగా నిలబెట్టవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం ఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

News June 18, 2024

రైతుల ఖాతాల్లోకి డబ్బు.. PM కిసాన్ విడుదల

image

PM కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ.2వేలు క్రెడిట్ అవుతాయి.

News June 18, 2024

MGNREGA కూలీగా మారిన IRS అధికారి

image

100 రోజుల ఉపాధి హామీ పనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కూలీగా మారారో IRS అధికారి. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ భాగ. బెంగళూరు జోన్‌లోని GST కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తన సొంతూరికి వచ్చిన ఆయన.. MGNREGA కార్మికుడిగా మారి రోజంతా ఎండలో పనిచేశారు. కొన్ని అనుభవాలు జీవితంపై చెరగని ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఇన్‌స్టాలో ఫొటోలను పంచుకున్నారు.

News June 18, 2024

ఈ నెల 30 నుంచి ‘మన్ కీ బాత్’

image

ఈ నెల 30 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దీనిని పున:ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. కాగా మన్ కీ బాత్ ద్వారా మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

News June 18, 2024

జగన్ త్వరగా పోతే ప్రజలకు మంచి జరుగుతుంది: అయ్యన్న, అచ్చెన్న

image

AP: బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించాలన్న జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు Xలో మండిపడ్డారు. ‘ప్రజల గాలి తన వైపు లేదని ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఈ మనిషి నిజంగా మనిషేనా? తాను గెలిస్తే అన్నీ బాగున్నట్టు, ఓడిపోతే ఈవీఎంల మీద నెపాన్ని నెడతారా? ఇలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది’ అని <<13442979>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేశారు.

News June 18, 2024

కోహ్లీకి ‘ఫ్లయింగ్ కిస్‌’ ఇవ్వను: రాణా

image

దూకుడుకు మారు పేరైన కోహ్లీ ముందు ఫ్లయింగ్ కిస్‌ సెలబ్రేషన్స్ చేయబోనని KKR బౌలర్ హర్షిత్ రాణా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ‘కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరా?’ అనే ప్రశ్న రాణాకు ఎదురైంది. రాణా పైవిధంగా బదులిచ్చారు. SRH బ్యాటర్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ప్లాన్ ప్రకారం చేసింది కాదని వివరించారు. ఆ ఫ్లయింగ్ కిస్‌ వల్ల రాణా విమర్శలతో పాటు పెనాల్టీ, ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు.

News June 18, 2024

జియో నెట్‌వర్క్ డౌన్!

image

దేశంలోని పలుచోట్ల జియో నెట్‌వర్క్ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ఫైబర్ వంటి సర్వీసులు నిలిచిపోయినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 54% మంది, ఫైబర్ యూజర్లలో 38%, సాధారణ నెట్‌వర్క్ యూజర్లలో 7% మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.