news

News January 27, 2026

మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

image

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 27, 2026

లోకేశ్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు

image

AP: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. తన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.

News January 27, 2026

ప్రారంభమైన అఖిలపక్ష భేటీ

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీకి TDP తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు, YCP-మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్, BRS-సురేశ్ రెడ్డి, JSP నుంచి బాలశౌరి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై నేతలకు కేంద్రం ఇందులో సమాచారం ఇవ్వనుంది.

News January 27, 2026

నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

image

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.

News January 27, 2026

ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

image

<>ESIC<<>> మెడికల్ హాస్పిటల్, ఫరీదాబాద్‌ 50 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+ MD/MS/MCh/DM/DrNB/FNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 27, 2026

ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

image

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.

News January 27, 2026

మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

image

మాల్దీవ్స్‌కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్‌ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

News January 27, 2026

తల్లి వద్దే భావోద్వేగాలు.. ఎందుకంటే?

image

పిల్లలు తమ కోపాన్ని, ఏడుపును ఎక్కువగా తల్లి ముందే చూపిస్తుంటారు. దీనికి కారణం అమ్మపై ఉన్న నమ్మకమేనని నిపుణులు చెబుతున్నారు. ‘తాము ఎలా ప్రవర్తించినా తల్లి వదిలి వెళ్లదని, ఆమె వద్దే తమకు రక్షణ ఉంటుందని వారు భావిస్తారు. పిల్లలు అమ్మ దగ్గరే అన్ని భావోద్వేగాలనూ స్వేచ్ఛగా బయటపెడతారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి గుర్తు. అందుకే అరిస్తే కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News January 27, 2026

కళ్ల కింద ముడతలు తగ్గాలంటే?

image

అందంగా కనిపించాలంటే మేకప్ వేస్తే సరిపోదు ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కళ్ల కింద ముడతలు వ‌ృద్ధాప్య ఛాయలకు సంకేతాలు. వీటిని తగ్గించాలంటే రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటికొలను దగ్గర పెట్టి….చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి.

News January 27, 2026

భానుచందర్ ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

సీనియర్ నటుడు భానుచందర్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చింది. తాను తీస్తోన్న సినిమాలో నటించేందుకు భానుచందర్ ఓకే చెప్పారంటూ ఓ యువ డైరెక్టర్ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందులో తెల్లటి గడ్డంతో స్లిమ్‌గా అయిపోయిన భానుచందర్‌ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిరీక్షణ సినిమాతో సినీ ప్రేమికులకు దగ్గరైన ఆయనను చాలా కాలం తర్వాత చూసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 73ఏళ్లు.