India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొందరు ఎన్డీఏ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. ‘మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా మేము ఎన్నికల్లో పోరాడాం. ఎలాంటి వివక్ష లేకుండా ఉండి ఉంటే ఇండియా కూటమికే మెజారిటీ వచ్చేది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి మనుగడ కష్టమే. ఆ కూటమి బలహీనంగా ఉండటంతో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఎలిమినేట్ కావడంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్వదేశం వెళ్లలేదు. అమెరికా నుంచి నేరుగా యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఆమిర్, ఇమాద్, రవూఫ్, షాదాబ్, ఆజం ఖాన్ కూడా అభిమానుల ఆగ్రహానికి భయపడి యూకే వెళ్లారట. కొన్నాళ్లు అక్కడే ఉండి తర్వాత పాక్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతానికి యూకే లోకల్ లీగ్స్‌లో ఆడాలని వారు భావిస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి.
‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024’ ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంగ్ కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై (136) నిలిచింది. 2013లో సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరం ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ (164), చెన్నై (189), బెంగళూరు (195), హైదరాబాద్ (202) ఉన్నాయి.
NCP(SP) అధినేత శరద్ పవార్‌ను TMC MPల బృందం కలిసింది. స్టాక్ మార్కెట్ మేనిపులేషన్‌పై విచారణ జరిపించాలనే వారి డిమాండ్‌కు పవార్ మద్దతిచ్చారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌తో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్‌ను మేనిపులేట్ చేశారని TMC అధినేత్రి, WB CM మమత ఆరోపిస్తున్నారు. BJP ‘బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ స్కామ్’కు పాల్పడటంతో ఇన్వెస్టర్లు రూ.30లక్షల కోట్లు నష్టపోయినట్లు రాహుల్ సైతం ఆరోపణలు గుప్పించారు.
అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అందరి దృష్టి ఎన్టీఆర్ ‘దేవర’పై పడింది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి’ రిలీజ్ తర్వాత వచ్చే స్టార్ హీరో సినిమా ‘దేవర’ ఒకటే. దీంతో సెప్టెంబర్ 17న రిలీజయ్యే ఈ మూవీ ఫిల్మ్ మార్కెట్‌లో హాట్ కేక్‌లా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘పుష్ప-2’ AUG 15న రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాకపోవడంతో పోస్ట్ పోన్ అయింది.
TG: గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను BRS సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని ప్రొ.కోదండరాం మండిపడ్డారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, నీటిమట్టం పెరిగితే ప్లాంట్‌ను కాపాడుకోలేమన్నారు. KCR సర్కార్ తొందరపాటు వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలు రూ.81వేల కోట్ల అప్పులయ్యాయని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను కలిసిన సందర్భంగా కోదండరాం చెప్పారు.
AP: రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 5 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జులై 12న ఎన్నికలు, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, టీడీపీలో చేరడంతో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడటంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
AP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి <<13459306>>శాసనసభ<<>> సమావేశాలు జరుగుతాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. bie.ap.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.
‘పవర్ కట్’ అయిందని ట్విటర్ వేదికగా కంప్లైంట్ చేస్తే అధికారులు ఇంటికి వచ్చి ట్వీట్ డిలీట్ చేయాలని చెబుతున్నారని ఓ నెటిజన్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘గతంలో పవర్ కట్ గురించి కంప్లైంట్ చేశాను. అప్పుడు USC, మొబైల్ నంబర్ ఇచ్చాను. సిబ్బంది ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ట్వీట్ డిలీట్ చేయండని అడిగారు. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పారు’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.