news

News June 17, 2024

‘పుష్ప-2’ మేకర్స్ మనసులో రెండు తేదీలు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి తప్పుకోవడంతో కొత్త విడుదల తేదీ కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఓవర్సీస్ బాక్సాఫీస్‌ని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తే USAలో వారం రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ చేస్తే భారత్‌లో క్రిస్మస్, న్యూఇయర్ హాలీడేస్‌ మూవీకి భారీగా కలెక్షన్లు తెచ్చిపెడతాయని అనుకుంటున్నారు.

News June 17, 2024

ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు?: తెలంగాణ కాంగ్రెస్

image

మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్‌ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్‌ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్‌జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.

News June 17, 2024

వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

image

AP: మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

News June 17, 2024

‘నాన్‌ క్యాష్ పేమెంట్స్’కే మొగ్గు

image

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ వాడే భారతీయులు నాన్ క్యాష్ పేమెంట్స్‌కే మొగ్గు చూపుతున్నారు. క్యాష్(భౌతిక నగదు)కు బదులుగా UPI, డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్స్‌తో పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆరేళ్ల క్రితం 20.4%గా ఉన్న నాన్ క్యాష్ పేమెంట్స్ ఇప్పుడు ఏకంగా 58.1%కి చేరింది. ఈ పేమెంట్స్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో చైనా ముందుండగా, ఆ తర్వాత ఇండియా, ఇండోనేషియా ఉన్నట్లు 2023 నివేదికలు చెబుతున్నాయి.

News June 17, 2024

EVMల హ్యాకింగ్.. మస్క్‌కు అవకాశం ఇవ్వాలన్న పురందీశ్వరి

image

AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్‌ను భారత్‌కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.

News June 17, 2024

భారీ వర్షం.. అవసరమైతే కాల్ చేయండి!

image

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.

News June 17, 2024

కరెంట్ షాక్ ఇచ్చి రేణుకాస్వామికి చిత్రహింసలు!

image

హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి <<13434917>>హత్య<<>> కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని తెలిసింది. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.

News June 17, 2024

జాన్వీకి ట్విటర్ అకౌంట్ లేదు: టీమ్

image

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరిట ట్విటర్‌లో చెలామణి అవుతున్న అకౌంట్లు ఫేక్ అని ఆమె టీమ్ ప్రకటించింది. ఆమెకు ట్విటర్‌లో అకౌంట్ లేదని స్పష్టం చేసింది. కొందరు జాన్వీ పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి, బ్లూటిక్ కూడా పొందారంది. వాటితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆయా అకౌంట్ల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. కాగా జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అప్డేట్స్ ఇస్తుంటారు.

News June 17, 2024

BJPకే స్పీకర్ పోస్ట్.. మిత్రపక్షాలకు డిప్యూటీ?

image

లోక్‌సభ స్పీకర్ పదవిని తమ పార్టీ వారికే కేటాయించాలని బీజేపీ నిర్ణయించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. NDA కూటమిలోని మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఈ విషయంలో మిత్రపక్షాలను ఒప్పించే టాస్క్ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ పోస్టు టీడీపీ, జనతా దళ్‌ పార్టీల్లో ఎవరికి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

News June 17, 2024

టికెటింగ్ బిజినెస్‌పై పేటీఎంతో చర్చిస్తున్నాం: జొమాటో

image

టికెటింగ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కన్ఫామ్ చేసింది. పేటీఎంకు చెందిన మూవీ & ఈవెంట్ టికెటింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. దీనిపై స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టత ఇచ్చింది. అయితే ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు జొమాటోతో పాటు పేటీఎం సైతం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.1500కోట్లుగా తెలుస్తోంది.