India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్(AAG) పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మంగళగిరి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లుగా పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు.
AP: 2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019-24 మధ్య 4 శాతమే జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ‘2019కి ముందు రూ.11,537కోట్లు ఖర్చు చేస్తే 2019-24 మధ్య రూ.5వేల కోట్లు ఖర్చు చేశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్-1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్‌బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి DPR ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు’ అని వివరించింది.
టీ20 WCలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ‘కోహ్లీ బాగా రాణిస్తున్నారా లేదా అని ప్రతిసారి ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన పరుగులు చేయాలనే ఆకలితో ఉండటం మంచిదే. సూపర్-8 మ్యాచుల్లో కోహ్లీ అగ్రెసివ్‌నెస్ జట్టుకు సహాయపడుతుంది. నెట్స్‌లో ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రన్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
AP: ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 18న కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు ఒరాకిల్ వంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ, అమెరికా తరఫున బౌలర్‌గానూ రాణిస్తున్నారు సౌరభ్ నేత్రావల్కర్. యూఎస్ఏ జట్టు సూపర్-8కు చేరుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సౌరభ్‌కు జీతాన్ని పెంచాలంటూ ఒరాకిల్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడికి పని బరువును తగ్గించాలని కోరుతున్నారు. ముంబైలో పుట్టిన సౌరభ్ 2010లో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. ఉద్యోగరీత్యా USలో స్థిరపడ్డారు.
AP: గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. కాగా ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు సమాచారం.
ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
పలు కీలక అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇటీవల ముగిసిన జీ7 సదస్సులో ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘భారత్-కెనడా మధ్య ఉన్న సున్నితమైన అంశాల గురించి నేను ప్రస్తావించను. కానీ రెండు దేశాలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి’ అని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాతి నుంచి ఇరు దేశాల మధ్య బంధం క్షీణించిన సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్-ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార ఎలా ఉంటుందో చూద్దామని మెగాఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు క్లీంకారకు చెందిన ఓ ఫొటో బయటకి వచ్చింది. చిన్నారిని ఆమె తండ్రి రామ్‌చరణ్ ఎత్తుకుని లాలిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటో ఫాదర్స్ డే సందర్భంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమ బిడ్డతో చెర్రీ, ఉపాసన దంపతులు నడిచివెళ్తున్న ఫొటో సైతం నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. మరోవైపు పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో సాయి తేజ్ నిన్న తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నారు. కాగా పవన్‌కు చిరంజీవి భార్య సురేఖ కూడా ఓ పెన్నును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ ఏకంగా రూ.2.50 లక్షలు అని టాక్.
Sorry, no posts matched your criteria.