India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మహిళలకు ప్రతి నెలా ₹2,500 సాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ₹5లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పీఎస్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో అల్లర్ల ఘటనకు సంబంధించి వీరిపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పిన్నెల్లి బ్రదర్స్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు టాక్.
ఇవాళ ఫాదర్స్‌డే జరుపుకోవడం వెనుక ఓ కూతురి కృషి ఉంది. USకు చెందిన సొనోరా స్మార్ట్ తండ్రి విలియం ఓ సైనికుడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆరుగురు బిడ్డలను కంటికిరెప్పలా పెంచాడట. దీంతో ఆమె తండ్రి విలియం పుట్టినరోజు జూన్ 5న ఫాదర్స్ డే నిర్వహించాలనుకుంది. ఏర్పాట్లకు తగిన సమయం లేకపోవడంతో జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా చేసుకున్నారట. ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దీన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ JAC నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటంతో సన్నద్ధం కాలేకపోయామన్నారు. కాగా జులై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని APPSC పేర్కొన్న సంగతి తెలిసిందే.
మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. 21 సెకన్లలో యూరిన్ చేయడం ఆరోగ్యకరమని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థుల బృందం తెలిపింది. రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగితే 8 సార్లు మూత్ర విసర్జన చేయాలని యూరాలజిస్ట్ నికల్ ఐసెన్‌బ్రౌన్ తెలిపారు. కాగా పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువ సార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమేనని పరిశోధనలో తేలింది.
కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఏడాదికి గాను 23 మంది రచయితలకు యువ పురస్కార్ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుకు TGలోని నిజామాబాద్‌కు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ ఎంపికయ్యారు. ఆయన గిరిజనుల జీవిత గాథలపై ‘ఢావ్లో’ అనే కథా సంకలనాన్ని రచించారు. అటు APలోని వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌ను ‘మాయాలోకం’ నవలకు గాను బాలసాహిత్య పురస్కారం వరించింది. సాహిత్య అకాడమీ వీరికి ₹50వేలు, జ్ఞాపిక ఇవ్వనుంది.
మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు లేని చోట ICC మ్యాచ్‌లు నిర్వహించకూడదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. నిన్న వర్షం తగ్గి గంటలు గడిచినా లాడర్‌హిల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో భారత్, కెనడా మ్యాచ్ రద్దవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పిచ్‌ను కవర్ చేసి మైదానాన్ని వదిలేయకూడదని చెప్పారు. ‘ఇంత డబ్బున్నా ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని మ్యాచ్‌ల రద్దు సరికాదు’ అని మైకెల్ వాన్ అన్నారు.
తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జులై 1న కొత్త ఛార్జీలను నిర్ధారించనుంది. సలహాలు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక తుది మార్కెట్ విలువను ఖరారు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో స్థలాల వాస్తవిక ధరలను బట్టి మార్కెట్ విలువను నిర్ణయించనుంది.
ప్రతిష్ఠాత్మక సివిల్స్-2024 ప్రిలిమినరీ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరగనుంది. మొత్తం 1,056 పోస్టులకు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉ.9.30-11:30గం. వరకు పేపర్-1, మ.2:30-4.30గం. వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఎగ్జామ్‌కు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసి వేస్తారు. ఆ తర్వాత లోనికి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫొటో ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
ప్రతి కొడుకు, కూతురికి తొలి హీరో నాన్నే. మొదటి అడుగులు నేర్పేది ఆయనే. తన పిల్లల సంతోషం కోసం ఇష్టాలను త్యాగం చేసే గొప్ప వ్యక్తి. అమ్మ ప్రేమలో ఆప్యాయత కనిపిస్తే, నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. కొండంత ప్రేమను మనసులో దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ఖర్చు చేస్తాడు. కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటాడు. ఆయన చేసిన త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాల్సిందే.
HAPPY FATHERS DAY.
Sorry, no posts matched your criteria.