India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఇండియా యూనిట్‌లో వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వివో ఇండియాలో టాటా కనీసం 51% వాటాను కొనాలని కేంద్రం ఆశిస్తోంది. భారత్‌లోని విదేశీ సంస్థల కార్యకలాపాల్లో స్థానికుల భాగస్వామ్యం సైతం ఉండాలన్న కేంద్రం సూచనల నేపథ్యంలో వివో ఇక్కడి సంస్థలతో చేతులు కలుపుతోంది.
జీ7 సమ్మిట్‌లో భాగంగా ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని జెలెన్‌స్కీతో మోదీ అన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ఘర్షణలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చల ద్వారానే శాంతి స్థాపన సాధ్యమనే విషయాన్ని భారత్ విశ్వసిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
ఫోన్ నంబర్లపై టెలికాం సంస్థల నుంచి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు వస్తోన్న <<13434128>>వార్తల<<>>ను TRAI ఖండించింది. రెండు సిమ్‌లు, వినియోగంలో లేని నంబర్లపైనా ఛార్జీలు విధిస్తామనేది అవాస్తవమని తెలిపింది. నిరాధారమైన ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని వెల్లడించింది. ఈ ఊహాగానాలను ప్రజలు పట్టించుకోవద్దని పేర్కొంది.
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలకమైన ఆధారాల ఆచూకీ లభించడంలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. షీనా అవశేషాలుగా CBI చెబుతున్న పుర్రె ఎముకలు కొన్నాళ్ల క్రితం కనిపించకుండా పోయాయి. వెతికినా దొరకకపోవడంతో గతంలో వాటిని మానవ అవశేషాలుగా నిర్ధారించిన డా.ఖాన్ వాంగ్మూలంతో ఈ కేసులో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనివల్ల ఈ కేసు బలహీనంగా మారే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన శ్రీనివాసరావును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర చీఫ్‌గా నియమించారు. కీలక పదవి వరించడంతో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ పల్లా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
తెలంగాణ ICET ఫలితాలను HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు విడుదల చేశారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,647 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 33,928 మంది పురుషులు కాగా, 37,718 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 5543 మంది నాన్-లోకల్ కేటగిరీలో అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. WAY2NEWS యాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లిన నేపథ్యంలో మరోసారి ‘MELODI’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో మోదీతో సెల్ఫీని షేర్ చేసిన ఇటలీ ప్రధాని మెలోని ‘గుడ్ ఫ్రెండ్స్ #MELODI’ అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరి ఫొటోలతో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం G7లోని 4దేశాలకు మించిన ఎకానమీ భారత్ సాధించడంతో మోదీని మెలోని ప్రత్యేకంగా <<13433417>>ఆహ్వానించారు.<<>>
AP: టెక్నాలజీ సాయంతో పరిపాలనను సులభతరం చేసేందుకు 2014లో TDP ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థే రియల్ టైమ్ గవర్నెన్స్. చంద్రబాబు రాకతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవస్థతో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో సచివాలయంలోనే పర్యవేక్షించొచ్చు. ప్రభుత్వ శాఖల పనితీరు, ట్రాఫిక్, ప్రాజెక్టులు, మీడియా, వాతావరణం వంటి అంశాలను RTGS కేంద్రం నుంచే సమీక్షించొచ్చు. తమ ప్రాంతాల్లోని సమస్యలపై ప్రజలు ఇందులో ఫిర్యాదు చేయొచ్చు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
AP: డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ చెప్పారు. ‘మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారనే నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.