India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న, ఎన్ శ్రీరామ్ బాలాజీ ఆడనున్నారు. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ ఈ మేరకు ప్రకటించింది. డేవిస్ కప్ మాజీ కెప్టెన్ నందన్ బాల్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. యుకీ బాంబ్రి పేరూ పరిశీలనలో ఉన్నప్పటికీ.. కోర్టులో బాలాజీ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అవకాశం కల్పించినట్లు వివరించింది.
ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం లండన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో నామినేట్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషించారు.
T20WCలో ఒమన్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48 పరుగుల లక్ష్యాన్ని 3.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. సాల్ట్ 12, బట్లర్ 24, విల్ జేక్స్ 5, బెయిర్‌స్టో 4 రన్స్ చేశారు.
పెట్టిపోయలేని వట్టి నరుడు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనజెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పుట్టలోని చెదలు పుట్టి మరణిస్తాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే అవసరంలో ఉన్నవారికి దానధర్మములు చేయని మనిషి పుట్టినా, మరణించినా ప్రయోజనం లేదు.
T20WCలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఒమన్ టీమ్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షోయబ్ ఖాన్ 11 మినహా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 3, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశారు. WC హిస్టరీలో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. గతంలో ఉగాండ 39(VS విండీస్), నెదర్లాండ్స్ 39(VS శ్రీలంక), 44(VS శ్రీలంక) స్కోర్లు నమోదు చేశాయి.
వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని NCP-SP చీఫ్ శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘LS ఎన్నికల సమయంలో ప్రజలు మనసులో ఏముందో చెప్పలేదు. అయినా ఆందోళన చెందొద్దని, వారు EVMలో సరైన బటన్ నొక్కుతారని కార్యకర్తలకు చెప్పా. వాటిని తెరిచినప్పుడు ఓటర్లు చేసిన మ్యాజిక్ కనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో NCP-SP 8 సీట్లు గెలుచుకుంది.
టీ20 వరల్డ్ కప్ పలు మ్యాచ్‌లు అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి పిచ్‌లపై స్కోరు కొట్టేందుకు అన్ని జట్లూ చాలా ఇబ్బంది పడ్డాయి. దీనిపై టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబే స్పందించారు. ‘ఆ పిచ్‌లపై సిక్స్ కొట్టడం చాలా కష్టం. సిక్స్ కొట్టాలంటే సరైన అవకాశం కోసం వేచి చూడాల్సిందే. టైం తీసుకోవాల్సిందే. నాకైతే రంజీ ట్రోఫీ ఆడుతున్నట్లుగా అనిపించింది’ అని వివరించారు.
✒ ప్రపంచ రక్తదాతల దినోత్సవం
✒ 1916: ప్రముఖ రచయిత బుచ్చిబాబు జననం
✒ 1928: అర్జెంటీనా విప్లవకారుడు చేగువేరా జననం
✒ 1941: సాహితీ చరిత్రకారుడు రంగనాథాచార్యులు జననం
✒ 1961: భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత కె.శ్రీనివాస కృష్ణన్ మరణం
✒ 2014: నటి తెలంగాణ శకుంతల మరణం
✒ 2014: సమరయోధుడు కానేటి మోహనరావు మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TG: సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అతను ఓ వ్యక్తితో రూ.15 లక్షలకు డీల్ చేసుకున్నారు. బాధితుడు తొలి విడతలో రూ.5 లక్షలు ఇచ్చాడు. రెండో విడతలో రూ.3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి రావడంతో సుధాకర్ పారిపోయాడు. సినిమా స్టైల్‌లో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.