news

News June 13, 2024

ఇవాళ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు

image

TG: న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్‌ 3న నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు.

News June 13, 2024

ట్విటర్‌ బయోలో మార్పు

image

AP: ట్విటర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు బయో మారింది. ఇది వరకు టీడీపీ అధినేత, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఉండగా తాజాగా దీనికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేశారు. ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈమేరకు మార్పులు చేశారు. కాగా టీడీపీ అధినేతకు ట్విటర్‌లో 5.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు.

News June 13, 2024

Common Proverbs-Meaning

image

✒ A bird in the hand is worth two in the bush
Meaning: What you have is better than what you might get
✒ Actions speak louder than words
Meaning: What someone does means more than what they say they will do
✒ An apple a day keeps the doctor away
Meaning: Eating an apple daily keeps you healthy

News June 13, 2024

25 వేల టీచరు పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ‘మనఊరు- మనబడి’ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.

News June 13, 2024

బాల్య వివాహాల నిర్మూలనకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం

image

రాష్ట్రంలో బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటర్ విద్యార్థినుల ఖాతాల్లో రూ.1,000, డిగ్రీలో చేరినవారికి రూ.1,250, పీజీ చేసే వారికి రూ.2,500 అందజేయనుంది. త్వరలోనే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి నెలా 11తేదీ వరకు విద్యార్థుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఈ పథకానికి ఏటా ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించనుంది.

News June 13, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

ఏమి గొంచువచ్చె నేమి తాగొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచట కేగు దానెచ్చటికి నేగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పుట్టుకతో మనిషి ఏమీ తీసుకురాడు. చనిపోయినప్పుడు ఏమీ తీసుకుపోడు. అతను సంపాదించిందంతా ఎక్కడికి పోతుందో, అతను ఎక్కడికి పోతాడో(స్వర్గము, నరకము) ఎవరికీ తెలియదు.

News June 13, 2024

జూన్ 13: చరిత్రలో ఈరోజు

image

✒ 1831: విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని రూపొందించిన జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం.
✒ 1879: మరాఠీ విప్లవకారుడు గణేష్ దామోదర్ సావర్కర్ జననం.
✒ 1937: కంప్యూటర్ శాస్త్రవేత్త డా.రాజ్‌రెడ్డి జననం.
✒ 1965: భారత మాజీ క్రికెటర్ మణీందర్ సింగ్ జననం.
✒ 1992: హీరోయిన్ దిశా పటాని జననం.
✒ 1993: భారత ఆర్చర్ దీపికా కుమారి జననం.
✒ 2023: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం

News June 13, 2024

పథకాల గురించి అడిగితే ‘ఓ స్త్రీ రేపు రా’ కథ చెబుతున్నారు: నిరంజన్

image

TG: కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై ఉండదా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘సీఎం, మంత్రులను పథకాల గురించి అడిగితే దయ్యానికి భయపడి గోడలమీద రాసే ‘ఓ స్త్రీ రేపు రా’ కథను వినిపిస్తున్నారు. డిసెంబరు 9 నుంచి రూ.15 వేల రైతు భరోసా అనే హామీ ఏమైంది? వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది. INC హామీలు నీటి మీది రాతలని ప్రజలకు తెలిసింది’’ అని పేర్కొన్నారు.

News June 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 13, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేస్తాం: మంత్రి పయ్యావుల

image

AP: సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మంత్రి పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ‘సమాజానికి మేం ఏం చేయగలమనే ఆలోచనతో మా ప్రస్థానం మొదలైంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తాం. మేము చేసే అభివృద్ధిపై బ్లూ ప్రింట్ విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.