India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని YCP నేత YV సుబ్బారెడ్డి విమర్శించారు. ‘2014 నుంచి 19 వరకు CBN ఇలాంటి పాలనే చేశారు. ప్లాన్ ప్రకారం YCP కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారు. కొన్నిచోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని YVS వెల్లడించారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్నౌజ్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన ఎంపీగా కొనసాగుతానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత అవధేశ్ ప్రసాద్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి పంపారు. ఇటీవల యూపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో SP 37 స్థానాలు గెలుచుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన ఆమె నటిస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పటివరకు మలయాళంలో సినిమా చేయలేదు.
తన భర్త సీఎం అయ్యేవరకూ తనకు తెలియదని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భార్య ప్రియాంక మాఝీ తెలిపారు. టీవీలో చూసే తాను ఈ విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ‘నా భర్త సీఎం అవుతారని ఊహించలేదు. మంత్రి పదవి దక్కుతుందని భావించాం. కానీ ఏకంగా ఆయన సీఎం అయ్యారు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఒడిశా మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మాఝీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయమంత్రి <<13416466>>శ్రీనివాస వర్మ<<>> కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్టీల్ ప్లాంట్ AP ప్రజలకు సెంటిమెంట్‌తో కూడుకున్నది. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతా. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తా. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం. ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చింది. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.. ఆశిస్తున్నా’ అంటూ చిరంజీవి Xలో పోస్ట్ పెట్టారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
వందేభారత్ ట్రైన్‌లో టికెట్ లేని ప్రయాణికులతో రద్దీగా ఉన్నట్లు వైరల్ అయిన <<13419254>>వీడియో<<>> పాతదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కొందరు రైతులు బలవంతంగా రైలులోకి ఎక్కినప్పుడు జరిగిన సంఘటన అని Xలో పేర్కోంది. పాత వీడియోను ప్రచారం చేస్తున్నారని.. దయచేసి ఇలాంటివి చేయొద్దని కోరింది. ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది.
AP రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్‌కు ఏ శాఖ వస్తుందనే చర్చే నడుస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయనకు డిప్యూటీ CM ఖరారైనట్లు తెలుస్తోంది. మరి దాంతో పాటు హోంమంత్రి ఇస్తారా? వేరే ఏదైనా శాఖ అప్పగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ CM అని పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ జనసేనానికి ఏ శాఖ సూట్ అవుతుందని మీరు భావిస్తున్నారు?
2019లో ఒకే ఒక జనసేన MLA గెలిచారు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో జనసేన బలం శూన్యమైనట్లయింది. ఇక మునిగే పడవలాంటి ఆ పార్టీలో ఎవరూ ఉండరని, అంతకుముందు ఏడాదే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమవుతారనే భావన చాలామందిలో కలిగింది. ఆయన మాత్రం అలా చేయలేదు. రాముడికి హనుమంతుడిలా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. నిజాయితీని నిరూపించుకున్నారు. ఈరోజు తెనాలి MLAగా మంత్రి పదవి అందుకున్నారు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విఫలమైతే జట్టుపై ప్రభావం పడేదని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నారు. హార్దిక్ బౌలింగ్ సత్తాపై ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నామని చెప్పారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఈ ఆల్‌రౌండర్ రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఇవాళ అమెరికాతో తలపడనుంది.
Sorry, no posts matched your criteria.