news

News June 10, 2024

BREAKING: హోంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్

image

తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం దక్కింది. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయనకు తొలిసారి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, పార్టీ బలోపేతం కోసం బండి కృషి చేశారు.

News June 10, 2024

పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఏ శాఖ వచ్చిందంటే?

image

AP: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేంద్రం శాఖలు కేటాయించింది. సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలను అప్పగించింది. అటు నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించింది.

News June 10, 2024

ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారంపై CBSE హెచ్చరికలు

image

ఆన్‌లైన్‌లో సిలబస్, శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని CBSE హెచ్చరించింది. 2024-25 విద్యా సంవత్సరానికి‌గానూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పేరుతో పాత లింకులు, వార్తలు ప్రచారంలో ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అనధికార సోర్స్‌ల నుంచి వచ్చే సమాచారం స్కూళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయవచ్చని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

News June 10, 2024

రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ

image

కేంద్రమంత్రి పదవులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీకి ఇదే శాఖ కేటాయించారు. అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ కేబినెట్ మంత్రిగా పని చేశారు.

News June 10, 2024

BREAKING: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

image

* జేపీ నడ్డా – వైద్యశాఖ
* భూపేంద్రయాదవ్ – పర్యావరణశాఖ
* గజేంద్రసింగ్ షెకావత్ – సాంస్కృతికం&పర్యాటకం
* కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు
* శ్రీపాదనాయక్ – విద్యుత్ శాఖ(సహాయ)
* ధర్మేంద్ర ప్రధాన్ – విద్య, మానవవనరుల అభివృద్ధి
* మన్‌సుఖ్ మాండవియా – కార్మికశాఖ, క్రీడలు
* సురేశ్ గోపీ – సాంస్కృతికం&పర్యాటకం(సహాయ మంత్రి)

News June 10, 2024

BREAKING: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

image

* అమిత్ షా – హోంమంత్రిత్వశాఖ
* జైశంకర్‌ – విదేశాంగశాఖ
* రాజ్‌నాథ్ సింగ్‌ – రక్షణ మంత్రిత్వ శాఖ
* నిర్మలా సీతారామన్‌ – ఆర్థిక శాఖ
* అశ్వినీ వైష్ణవ్ – రైల్వే శాఖ, సమాచార&ప్రసార శాఖ
* హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం శాఖ
* పీయూష్ గోయల్ – వాణిజ్యం
* శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయం
* జితన్‌రామ్ మాంజీ – MSME
* మనోహర్‌లాల్ ఖట్టర్ – హౌసింగ్&అర్బన్ డెవలప్మెంట్

News June 10, 2024

అమెరికాలో గుండెపోటుతో MCA అధ్యక్షుడు మృతి

image

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే గుండెపోటుతో న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఇండియాVS పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు MCA సెక్రటరీ అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్‌తో కలిసి ఆయన న్యూయార్క్‌కు వెళ్లారు. ఇండియా గెలిచాక స్టేడియంలో ఆయన సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. కాలే 2022లో ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

News June 10, 2024

ఆ స్కూళ్లను మూసివేయొద్దు: సీఎం రేవంత్

image

TG: విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు మూసివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News June 10, 2024

T20 WC: ఎమోషనల్ డ్యామేజ్ చేశారు: ఆనంద్ మహీంద్రా

image

T20WCలో పాక్‌పై భారత్ విజయం సాధించిన తీరుపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘టీమ్ఇండియా లోస్కోరుకే పరిమితం కావడంతో దాయాది చేతిలో ఓటమి తప్పదనే భావనను మాకు కలిగించింది. కానీ తీవ్ర ఒత్తిడిలో మన ప్లేయర్లు విజయాన్ని పాక్ నుంచి లాక్కొని వారికి ఘోర అవమానాన్ని మిగిల్చారు. రోహిత్ సేన ఎదురుదాడి దారుణం. ఆటలో మీరెప్పటికీ హీరోలుగా ఉండాలి. ఇదే నేను మీకు విధిస్తున్న శిక్ష’ అని పేర్కొన్నారు.

News June 10, 2024

కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు

image

AP: ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు కేబినెట్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియర్ MLAలు ఇలా పలు అంశాల వారీగా మంత్రులుగా అవకాశం కల్పించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. తమకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు ఉండవల్లిలోని CBN ఇంటికి క్యూ కడుతున్నారు. అటు జనసేనకు 5 పదవులు దక్కే ఛాన్సుంది.