news

News June 9, 2024

ఒకే ఫ్రేమ్‌లో 70,343 పరుగులు!

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న భారత్-పాక్‌ మ్యాచ్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు మెరిశారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ ఆట ప్రారంభానికి ముందు మైదానంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరు ముగ్గురూ కలిసి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 70,343 పరుగులు సాధించారు. అలాగే 165 సెంచరీలు, 2 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ (వన్డే WC) అవార్డులు పొందారు

News June 9, 2024

రోహిత్ శర్మ అరుదైన ఘనత

image

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో, T20ల్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఇంతవరకూ రోహిత్ తప్ప మరే బ్యాటర్ అఫ్రీది వేసిన తొలి ఓవర్లో సిక్సర్ కొట్టలేదు. కాగా అంతర్జాతీయ మ్యాచుల్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

News June 9, 2024

మందుబాబులకు గుడ్‌న్యూస్.. మళ్లీ రానున్న పాత బ్రాండ్లు!

image

AP: ప్రభుత్వం ఈనెల 14న కొత్త మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన పాలసీని రద్దు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 3600 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి, డిపాజిట్‌గా రూరల్ ప్రాంతంలో ఒక్కో షాపుకి రూ.45వేలు, అర్బన్ ఏరియాలో రూ.55వేలుగా నిర్ణయించనుందట. ఇప్పటివరకు విక్రయించిన బ్రాండ్లను తీసేసి పాత బ్రాండ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

News June 9, 2024

గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

image

తెలంగాణ గ్రూప్-4 ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల <>జాబితాను<<>> TGPSC విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు చెకింగ్ లిస్ట్‌తో పాటు 2 కాపీల చొప్పున అప్లికేషన్ ఫామ్, వెబ్‌సైట్‌లో ఉండే అటెస్టేషన్ ఫామ్‌ను వెరిఫికేషన్‌కు తీసుకురావాలని సూచించింది. ఈనెల 13 నుంచి వెబ్ ఆప్షన్ లింక్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. నాంపల్లిలోని TGPSC ఆఫీస్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో వెరిఫికేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

News June 9, 2024

కేబినెట్‌లో మహిళా మంత్రులు వీరే

image

☛నిర్మలా సీతారామన్
☛అన్నపూర్ణ దేవీ
☛అనుప్రియా పటేల్
☛శోభ కరంద్లాజే
☛సావిత్రి ఠాకూర్
☛రక్షా ఖడ్సే
☛నిముబెన్ బంభానియా
*వీరికి ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది.

News June 9, 2024

మోదీ కెప్టెన్‌గా జంబో టీమ్

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ కొలువుదీరింది. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా ఐదుగురు సహాయ(స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మోదీ టీమ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కింది.

News June 9, 2024

బాబు రాకతో భూముల ధరలకు రెక్కలు?

image

AP: మరోసారి టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎం అవుతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలైనట్లు టాక్. కాగా గత ఐదేళ్లుగా అమరావతిలో వివిధ నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. బాబు ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టబోతుండటంతో అమరావతికి పునరుజ్జీవనం వచ్చినట్లు తెలుస్తోంది.

News June 9, 2024

మోదీకి బిల్ గేట్స్ అభినందనలు

image

భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి దిగ్గజ వ్యాపార‌వేత్త బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేశారని కొనియాడారు. ప్రపంచంతో పాటు భారత్‌లోని ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

News June 9, 2024

భారత్‌కు షాక్.. ఓపెనర్లు ఔట్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచులో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. 19 పరుగులకే ఓపెనర్లు రోహిత్(13), కోహ్లీ(4) వికెట్లను కోల్పోయింది. అఫ్రీది, నసీమ్ తలో వికెట్ తీశారు.

News June 9, 2024

ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

image

రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగించింది.