India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోదీ 3.0 కేబినెట్‌లో కొందరు కీలక నేతలు లేనట్లు తెలుస్తోంది. మోదీ 2.0లో కీలక మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి నేతలకు ఈ సారి చోటు దక్కలేదని సమాచారం. అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఓడిపోయారు. హమిర్‌పుర్ నుంచి బరిలోకి దిగిన అనురాగ్ విజయం సాధించారు. కాగా వీరిద్దరితో పాటు మరికొందరికి మోదీ 3.0 కేబినెట్‌లో బెర్త్ దక్కలేదని చర్చ నడుస్తోంది. అయితే మరికాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.
బంగ్లా MP అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లో అరెస్టయిన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని గుర్తించారు. ఈ ఎముకలు MPవేనని భావిస్తున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపించనున్నారు. అంతకుముందు MP హత్య జరిగిన ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో మాంసపు ముద్దను పోలీసులు గుర్తించి DNA పరీక్షలకు పంపారు.
కేబినెట్‌లో చోటు దక్కిన ఎంపీలకు ప్రధాని మోదీ తేనేటి విందు ఏర్పాటు చేశారు. పరిపాలనపై దృష్టి పెట్టాలని, పనుల్ని సమయానికి పూర్తి చేయాలని వారికి సూచించారు. నేడు ప్రధానిగా మోదీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనా. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ బీజేపీ వద్దే కొనసాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంఘ్ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 14లో అంబర్‌పేట్ నుంచి MLAగా గెలిచారు. 2019లో SEC MPగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
BJPలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలను కేంద్రమంత్రి పదవులు వరించాయి. ఇందులో తెలంగాణ నుంచి MP బండి సంజయ్ ఉన్నారు. ఓ కార్పొరేటర్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత MPగా గెలిచిన ఆయన ఏడాదిలోపే BJP రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తెలంగాణలో BJP బలోపేతానికి తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం BJP నేషనల్ సెక్రటరీగా ఉన్న ఆయన రెండోసారి కరీంనగర్ MPగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సాధించారు.
T20 WC 2024లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో 366 స్కోర్(AUS 201, ENG 165) నమోదైంది. ఒక్క ప్లేయర్ కూడా 50+ స్కోర్ చేయకుండా అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచుగా ఇది రికార్డు సృష్టించింది. అంతకుముందు 2010లో SAvsNZ మ్యాచులో 327 స్కోర్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును AUSvsENG మ్యాచ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచులో హెడ్ 34, వార్నర్ 39, మార్ష్ 35, స్టోయినిస్ 30, బట్లర్ 42, సాల్ట్ 35 రన్స్ చేశారు.
TG: ప్రధాని మోదీ 3.O కేబినెట్‌లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డికి బెర్త్ ఖాయమైంది. ఈ రోజు సా.7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. ‘సికింద్రాబాద్ ప్రజలు, మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని, జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించిన ఆయన బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు. వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఆయన సొంతం. బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ వివాహం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
T20 WC చరిత్రలో భారత్, పాక్ ఇప్పటివరకు 7సార్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా 6 మ్యాచుల్లో గెలవగా, పాక్ ఒక్క మ్యాచులోనే నెగ్గింది. 2007లో గ్రూప్ మ్యాచ్, ఫైనల్‌తో పాటు 2012, 2014, 2016, 2022లో PAKపై IND విజయం సాధించింది. 2021లో భారత్‌పై పాక్ గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూసుకుంటే నేటి మ్యాచ్‌లో INDకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంది. రా.8కి ప్రారంభమయ్యే ఈ మ్యాచును star sports ఛానల్, hotstarలో చూడవచ్చు.
TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఉ.10:30కి ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. కొంతమంది అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఈ పరీక్షకు 4.03లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.