India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20WCలో ఇవాళ న్యూయార్క్ వేదికగా IND-PAK మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. టికెట్లను రీసేల్‌కు పెడుతున్నారు. ఓ వ్యక్తి సెక్షన్ 252లోని 20వ వరుసలో 30వ సీటును ఏకంగా $1.75 లక్షల(₹1.46 కోట్లు)కు ఓ వెబ్‌సైట్‌లో బేరం పెట్టాడు. అయితే దాన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా నసావు స్టేడియంలో టికెట్ రేట్లు $1,500-$10,000 మధ్య ఉన్నాయి.
AP: TDP MPలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మాజీ MP గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కేంద్రమంత్రిగా ఎంపికైన రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా ఎంపికైన పెమ్మసాని చంద్రశేఖర్ కొత్త బాధ్యతల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆశిస్తున్నా. ఎంపీగా గెలిచిన తొలిసారే దేశానికి సేవ చేయబోతున్న పెమ్మసానిని చూసి గుంటూరు, ఏపీ ప్రజలు గర్వపడుతున్నారు’ అని గల్లా Xలో పోస్ట్ చేశారు.
AP: ప్రకాశం(D) తాళ్లూరు నువ్వులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాల్లో అమ్ముకునేందుకు అవసరమైన ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను పొందింది. ఇటీవల శివరామపురం గ్రామానికి చెందిన రైతులు 150 క్వింటాళ్ల నువ్వులను ఎక్స్‌పోర్ట్ చేయగా, పరీక్షల్లో మంచి ఉత్పత్తులుగా నిర్ధారణ అయింది. గత రబీలో ఎకరాకు ₹12వేలు ఖర్చు పెట్టిన రైతులు మేలైన సాగు పద్ధతులతో ₹40 వేల నుంచి ₹50వేల వరకు దిగుబడి సాధించారు.
AP: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. దీంతో ఆ పార్టీకి కేంద్ర మంత్రి పదవులపై రోజుకొక అంశం తెరపైకి వస్తోంది. మోదీ 3.O కేబినెట్‌లో TDPకి 4 బెర్తులు దక్కొచ్చని NDTV పేర్కొంది. వారిలో రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్(అమలాపురం), దగ్గుమల్ల ప్రసాద్(చిత్తూరు) పేర్లు వినిపిస్తున్నాయని తెలిపింది. ఇవాళ మోదీ ప్రమాణస్వీకారం తర్వాత బెర్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి విగ్రహం, పాదాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్దఎత్తున రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గర్ల్‌ఫ్రెండ్‌కు పోలీసులు నోటీసులు పంపారు. ఏప్రిల్ 26న దేశం విడిచి రేవణ్ణ జర్మనీ పారిపోయారు. అక్కడ ప్రజ్వల్‌కు గర్ల్‌ప్రెండ్ సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ప్రజ్వల్‌తో పాటు ఆమె తల్లి భవానీని శనివారం అధికారులు ఐదు గంటల పాటు విచారించారు.
TG: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగనున్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా ఫార్మసీకి 7,376 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పరీక్ష రాసే సమయంలో టెక్నికల్ సమస్య వస్తే మరో కంప్యూటర్‌లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామన్నారు. నష్టపోయిన సమయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు.
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఇవాళ ఉ.10 గంటలకు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది హాజరవగా, వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40వేలమంది ఉన్నట్లు అంచనా. ఓపెన్ కేటగిరీలో 6వేల లోపు ర్యాంకు వస్తే సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది 23 ఐఐటీల్లో 17,385 సీట్లు భర్తీ చేయగా, ఈసారి వాటి సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది.
వెబ్‌సైట్: https://jeeadv.ac.in/
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CRPF, BSF, ITBP, CISF, SSB, AR)లో 1,526 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ASI, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, క్లర్క్ పోస్టులున్నాయి. ఇంటర్, షార్ట్ హ్యాండ్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, PET&PST, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
తెలుగులో యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారట. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం నటిస్తున్న ‘దిలేర్’ మూవీలో ఆమె నటిస్తారని సమాచారం. మేకర్స్ ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని కునాల్ దేశ్ ముఖ్ తెరకెక్కిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.