news

News June 7, 2024

ఆ జనాల ఓట్లు ఏమయ్యాయి? BRS అంతర్మథనం

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవడంపై BRS సమాలోచనల్లో పడింది. KCR బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలోకి బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టొద్దంటూ అధినేతకు అనుచరులు సూచిస్తున్నారట. దీంతో ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

News June 7, 2024

వైద్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

image

TG: వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నియామకాల ప్రక్రియ వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ద్వారా జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో డాక్టర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, స్టాఫ్‌నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం వంటి పోస్టులున్నాయి.

News June 7, 2024

అప్పలనాయుడు ఫ్లైట్ టికెట్ ఉందా?: చంద్రబాబు

image

AP: నిన్న TDP MPలతో చంద్రబాబు భేటీలో ఆసక్తికర ఘటన జరిగింది. కార్యకర్త స్థాయి నుంచి విజయనగరం MPగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడిని CBN అభినందించారు. ‘ఢిల్లీకి రావడానికి విమాన టికెట్ ఉందా అప్పలనాయుడు? లేకపోతే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అని CBN అడగటంపై మిగతా MPలు భావోద్వేగానికి గురయ్యారు. అతని స్థితిగతులు తెలుసుకోవడం, విమాన టికెట్ గురించి ఆరా తీయడం వారిని కదిలించింది.

News June 7, 2024

ఈ నెల 12న స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

image

APలోని స్కూళ్లకు ఈ నెల 12న సెలవు ఇవ్వాలని పాఠశాల ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను మాజీ MLC AS రామకృష్ణ కోరారు. CMగా చంద్రబాబు 12న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున స్కూళ్ల పున:ప్రారంభ తేదీని 13వ తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీచర్లు పాల్గొనేలా ఈ వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. కాగా స్కూళ్లకు జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండగా, జూన్ 12న తెరుచుకోవాల్సి ఉంది.

News June 7, 2024

19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

image

TG: రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి SAలుగా, 778 మంది గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, 6 వేలమంది ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.

News June 7, 2024

కేంద్రంలో టీడీపీకి 2 నుంచి 4 పదవులు?

image

AP: కేంద్ర కేబినెట్‌లో చేరనున్న TDPకి 2 కేబినెట్ పదవులు, మరో 2 సహాయమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఈ నెల 9న మోదీతో పాటే TDP MPలూ ప్రమాణం చేసే ఛాన్సుంది. TDP నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్ మాధుర్(అమలాపురం), కృష్ణప్రసాద్(బాపట్ల), ప్రసాదరావు(చిత్తూరు), పెమ్మసాని చంద్రశేఖర్(గుంటూరు), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(నెల్లూరు), బైరెడ్డి శబరి(నంద్యాల) పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

News June 7, 2024

హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తారా?

image

AP: విజయవాడలోని డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీకి NTR పేరును పునరుద్ధరిస్తారా అనే చర్చ మొదలైంది. దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరున్న ఈ వర్సిటీ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ వర్సిటీగా మార్చడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా ఎన్నికల్లో ఇప్పుడు TDP ప్రధాన పక్షంగా ఉన్న NDA కూటమి అధికారం చేపట్టబోతోంది. ఈనేపథ్యంలోనే వర్సిటీ పేరు మార్పు తెరపైకి వచ్చింది.

News June 7, 2024

నేడు ఎన్డీయే ఎంపీల కీలక భేటీ

image

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు NDA MPల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం TDP అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ MPలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం 6గంటలకు మోదీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయాలని TDP భావిస్తున్నట్లు సమాచారం.

News June 7, 2024

ఎయిర్ ఇండియా – విస్తారా విలీనానికి ఆమోదం

image

ఎయిర్ ఇండియా, విస్తారా విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో 25.1% వాటా దక్కనుంది. ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఎయిర్ఇండియా అంచనా వేస్తోంది. ఎయిర్ ఇండియా టాటా కంట్రోల్‌లో ఉండగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో సంయుక్తంగా విస్తారాను నిర్వహిస్తోంది. ఈ విలీనంతో ఎయిర్ఇండియా దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కేరియర్‌గా నిలవనుంది.

News June 7, 2024

తైవాన్‌ చైనాలో అంతర్భాగమే: చైనా ఎంబసీ

image

తైవాన్ చైనాలో అంతర్భాగమని భారత్‌లోని ఆ దేశ ఎంబసీ పునరుద్ఘాటించింది. వన్ చైనా పాలసీని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపింది. చైనాతో దౌత్యసంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్ తైవాన్ నేతల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ ఇటీవల ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది. తైవాన్-భారత్ బంధం బలోపేతానికి కృషి చేయాలని లాయ్ పేర్కొనడాన్ని చైనా తప్పుపట్టింది.