India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NDA కూటమిలో ఉన్న JDU కీలక డిమాండ్‌ను బీజేపీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్/అగ్నివీర్ స్కీమ్ అమలును పున: సమీక్షించాలని కోరినట్లు సమాచారం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ఈ నిర్ణయం ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక(ONOP), యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సూచనపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
AP: వైసీపీ నేతలు ఇవాళ సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. కౌంటింగ్ తర్వాత వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని <<13390762>>జగన్<<>> ఇప్పటికే ట్వీట్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటి హేమ ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ MAA(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు ‘మా’ పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. వివరణ ఇచ్చేంతవరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనుంది.
AP: ఎన్నికల హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. మా ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కన్నా ప్రజలు ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నట్లుంది. మా విధానం ప్రజలకు నచ్చకపోయి ఉండవచ్చు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి.’ అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో టీచర్ల బదిలీకి బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందు బొత్స మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సుల ఒత్తిళ్లతో ఈ బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎలాంటి బదిలీలు చేయవద్దంటూ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ అన్ని జిల్లాల DEOలకు ఆదేశాలు జారీ చేశారు.
AP: సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సాయంత్రంలోగా కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవు పెట్టారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, పురందీశ్వరికి కంగ్రాట్స్ చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.
దేశవ్యాప్తంగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 63,72,220 ఓట్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 8,97,323 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలోని 17 స్థానాల్లో మొత్తం 1,02,654 మంది ఓటర్లు (0.47% మంది) నోటాకు జై కొట్టారు. ఇక ఏపీలో నోటా ఓట్ల సంఖ్య 3,98,777. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకుంటారు.
కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి వర్గ కూర్పులో భాగంగా నాలుగు మంత్రిత్వ శాఖలను తామే అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలను తీసుకోవాలని చూస్తోందట. నితీశ్ నేతృత్వంలోని JD(U) రైల్వేను టార్గెట్ చేసిందట. కీలక శాఖల్లో సహాయ మంత్రి పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.