India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘టిల్లు స్క్వేర్’ సినిమాలో లిల్లీ పాత్రకు అనుపమ పరమేశ్వరన్ వంద శాతం న్యాయం చేశారని డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పారు. ‘ఈ సినిమాలో ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం చాలా మంది పేర్లను పరిశీలించినా అనుపమే పర్ఫెక్ట్ అనిపించింది. సినిమాలో లిల్లీ పాత్ర తీరే బోల్డ్‌గా ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ. ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాం’ అని డైరెక్టర్ మల్లిక్ తెలిపారు.
అప్పట్లో అంబేడ్కర్ వీధిదీపాల వెలుతురులో చదువుకున్నారని తెలుసు. అలాంటి అభినవ అంబేడ్కర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధి దీపం కింద ఓ బాలుడు శ్రద్ధగా చదువుకుంటున్న ఫొటోను పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. ‘విద్య లేని పిల్లలు.. రెక్కల్లేని పక్షి లాంటి వాళ్లు’ అని ఓ సామెతను జత చేశారు. ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నాడు ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రిలీజ్ డేట్, అలాగే RC 26 నుంచి పోస్టర్ రానున్నాయి. వీటితోపాటు అదే రోజు సుకుమార్ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయనున్నట్లు టాక్. దీంతో చరణ్ పుట్టినరోజున అభిమానులకు ఫుల్ మీల్సేనని సినీవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్‌లో బిజీగా ఉన్నారు.
AP: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ మావోయిస్టు కీలక నేత గణేశ్ ఓ లేఖ రాశారు. ఇందులో జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు. అతడికి విశ్వసనీయత తక్కువ. పార్టీ స్థాపించినప్పుడు తమది కమ్యూనిస్ట్ భావజాలమని చెప్పారు. కానీ ప్రస్తుతం జనసేన రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారింది’ అని ఆయన విమర్శించారు.
TG: రాజకీయ ప్రతీకారంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. ‘ఈడీ, సీబీఐతో బీజేపీ ప్రతిపక్షాలను అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయిస్తోంది. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక లక్ష్యం’ అని ఆయన మండిపడ్డారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
AP: ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ‘గత ఐదేళ్లలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేశారు. రాజకీయాల్లోనూ వారికి సామాజిక న్యాయం కల్పించాం. అందుకే మరోసారి జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల జీవితంలో పరీక్షలు కీలకమైనవి. ముఖ్యంగా పది, ఇంటర్ పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలని సన్నద్ధమవుతారు. రోజుకు నాలుగైదు గంటలే నిద్రకు కేటాయించి మిగిలిన సమయాన్నంతా సాధనకే కేటాయిస్తారు. ఎంసెట్, JEE పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ఈరోజు మళ్లీ రాదని భావించి కఠిన షెడ్యూల్ వేసుకొని చదువుతుంటారు. అలా ఓ JEE విద్యార్థి వేసుకున్న షెడ్యూల్ వైరలవుతోంది. మరి మీరూ ఇలా చదివారా.. కామెంట్ చేయండి
1739 : నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు
2000: భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2007: తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మరణం
2009: తెలుగు సినీ నటుడు టి.ఎల్.కాంతారావు మరణం
ప్రపంచ జల దినోత్సవం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: మార్చి 22, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:06
సూర్యోదయం: ఉదయం గం.6:19
జొహర్: మధ్యాహ్నం గం.12:23
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.40
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.