India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతోన్న Australia VS Oman మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్‌గా కనిపించారు. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా తమ ప్లేయర్లకు డ్రింక్స్ అందించేందుకు ఆయన స్టేడియంలో పరిగెత్తారు. ఈ ఫొటోను SRH ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ODI వరల్డ్ కప్ ఛాంపియన్, WTC విజేత, అత్యంత విజయవంతమైన కెప్టెన్ కమిన్స్ ఆటగాళ్లకు పానీయాలు అందించారని అభినందిస్తున్నారు.
AP: ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50 లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు. అటు ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఉండవల్లిలోని CBN ఇంటివద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేతల మాటలు, సవాళ్లు కొన్నిసార్లు శృతి మించి వారినే ముంచేస్తున్నాయి. అప్పట్లో తెలంగాణ వస్తే రాజకీయాలు వీడుతానన్న లగడపాటి అలా చేశారు. తాజాగా పవన్ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ ఈ మార్పుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో BRS విషయంలో నారాయణ చెవి కోసుకుంటానని, మునుగోడులో ఓడితే మళ్లీ పోటీ చేయనని కోమటిరెడ్డి శపథాలు చేశారు. ప్రజలకు పనులు, ఫలితాలు కావాలి తప్ప ఈ పర్సనల్ సవాళ్లు కాదు.
ఈసారి లోక్‌సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి MPలుగా గెలిచారు. UP నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు. కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టే వారిలో మాజీ CMలు శివరాజ్‌సింగ్, బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారితోపాటు సినీనటులు కంగనా, సురేశ్ గోపి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో TG నుంచి 10, AP నుంచి 13 మంది కొత్తవారున్నారు.
గత TDP ప్రభుత్వ హయాంలో MPలుగా సుజనా చౌదరి, సీఎం రమేశ్ కీలకంగా వ్యవహరించారు. పార్టీకి ఆర్థికంగా దన్నుగా ఉండటంతో పాటు పార్లమెంట్‌లోనూ TDP గళాన్ని గట్టిగా వినిపించారు. 2019 ఎన్నికల నాటికి NDA నుంచి TDP బయటకొచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ BJPలో చేరారు. మళ్లీ ఇప్పుడు APలో BJP నుంచి ఈ నేతలు కీలకంగా మారారు. సీఎం రమేశ్ MP, సుజనా చౌదరి MLA టిక్కెట్లు దక్కించుకుని గెలిచారు.
డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి బోణీ కొట్టింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది.
> డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ.
మహారాష్ట్రలో పార్టీలను చీల్చిన వారికి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. తన బాబాయి శరద్ పవార్ నుంచి NCPని దక్కించుకున్న అజిత్ పవార్ పార్టీ 4చోట్ల పోటీ చేస్తే ఒకచోట మాత్రమే నెగ్గింది. అటు శరద్ పవార్ సారథ్యంలోని NCP 10 చోట్ల పోటీ చేయగా 8 గెలిచింది. మరోవైపు శివసేన విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ శిండే వర్గం 7చోట్ల గెలిస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9MP సీట్లు గెలుచుకుంది.
ఒడిశాలో అధికారం కోల్పోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మాజీ CM నవీన్ పట్నాయక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ MLAలతో ఆయన మాట్లాడారు. తాను తొలిసారి CM అయినప్పుడు రాష్ట్రంలో 70% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని, దాన్ని 10శాతానికి తగ్గించానని గుర్తుచేశారు. 24ఏళ్లుగా రాష్ట్రానికి BJD సేవలందించిందని, ఇంకా పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో BJPకి 78, BJDకి 51 సీట్లు వచ్చాయి.
కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వస్తాయనో, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లిస్తారనో.. ఇలా ఒక్కో వర్గం ఒక్కో అంశంపై ఆశలు పెట్టుకుంటుంది. అయితే APలో మందుబాబులు బ్రాండ్ మద్యం దొరుకుతుందంటూ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు నాసిరకం మద్యం అమ్ముతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక బూమ్ బూమ్.. ఆంధ్రా గోల్డ్ బైబై అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
AP: వివేకా హత్య కేసు వెనుక ఓ జంట పాత్ర ఉందంటూ బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసును 90 శాతం సీబీఐ ఛేదించిందని.. మిగిలిన 10శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకుల్ని జైలుకి పంపిస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో భారతిరెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడికత్తి, వివేకా హత్య కేసులపై జగన్‌ను నిలదీస్తామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.