India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న బీజేపీ ఒడిశాలో ప్లాన్ మార్చింది. సీఎం నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. కేంద్రానికి మద్దతు ఇస్తున్నందుకు ఓవైపు బీజేడీకి ధన్యవాదాలు చెప్తూనే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత తొలిసారి స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారు. ఆయన అరెస్ట్ అక్రమం’ అని తెలిపారు. కాగా కాసేపట్లో కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై కోర్టు తీర్పు వెలువరించనుంది. కేసు నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
AP: పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన పార్టీ ప్రకటించింది. వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారని, ఆ నియోజకవర్గంలోనే 3 రోజులు ఉంటారని తెలిపింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని, అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన పేర్కొంది.
మరికొద్ది సేపట్లో IPL-2024 టోర్నీ ప్రారంభం కానుండగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. IPL ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగితే ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందుతుందట. 2019 IPLలో ఇదే జరిగిందని చెబుతున్నారు. ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో RCB కేవలం 70 పరుగులే చేయడం గమనార్హం.
CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే విద్యాశాఖ మంత్రి ఆతిశీ, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్‌కు ఆతిశీ అత్యంత సన్నిహితురాలు. సౌరభ్ సైతం చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనే పేరుంది. వీరికి తోడు కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా వినిపిస్తోంది.
AP: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది’ అని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్, ట్యాగ్‌ని జత చేసి పక్కన కత్తి సింబల్ ఉంచారు. కాగా ఈ సీటును మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్‌కు టీడీపీ కేటాయించింది.
AP: ధన దాహంతో మనుషులు క్రూర మృగాళ్లలా మారుతున్నారు. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలని ముక్కలుగా నరికి చంపేశారు. అనంతపురం(D) ఎర్రగుంట్లలో ఈ దారుణం జరిగింది. ఓబులమ్మ(84) అనే వృద్ధురాలు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం 7తులాల బంగారం ఇచ్చింది. వారు తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దలను ఆశ్రయించింది. దీంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గొడవకు దిగి ఆమెను ముక్కలుగా నరికి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.
AP: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని బీజేపీ నాయకురాలు యామినీ శర్మ ఆరోపించారు. పోలీసులు, నార్కోటిక్స్ విభాగం నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని.. ఆ సంస్థ యజమానికి వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిపై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు.
IPLకు దూరమైన ఆడమ్ జంపా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కుర్రాడికి చోటిచ్చింది. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ముంబై స్పిన్నర్ తనుష్ కొటియన్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. రంజీలో అతడు 502 రన్స్, 29 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. పని ఒత్తిడి కారణంగా IPL ఆడలేనని జంపా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. RR అతడిని మినీ వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.
రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయస్సు 30సం.లు, లోక్‌సభకు పోటీ చేసేందుకు కనీస వయస్సు 25సం.లు ఉండాలి. భారత పౌరసత్వంతో పాటు, దేశంలో ఏదైనా <<12903689>>ఒక నియోజకవర్గంలో<<>> ఓటరై ఉండాలి. 2సం.ల కంటే ఎక్కువ జైలు శిక్షకు గురికావద్దు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీకి ఆ నియోజకవర్గంలో ఒక ప్రపోజర్ సంతకం కావాలి. స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రపోజర్లు ఉండాలి. రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మానసికంగా పరిపక్వత తప్పనిసరి.
Sorry, no posts matched your criteria.